స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం, రాష్ట్రం అంతటా ప్రయాణించవచ్చని మంత్రి కీలక వ్యాఖ్యలు

స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం, రాష్ట్రం అంతటా ప్రయాణించవచ్చని మంత్రి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రమంతటా మహిళలు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు

రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అయినా ఉచితంగా ప్రయాణించ వచ్చని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 6700 బస్సులు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు.

గతంలో జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత బస్ పథకం అని తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రమంతటా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల లో మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు అని ప్రకటించారు.

ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేసేందుకు 1950 కోట్లు అదనంగా ఖర్చవుతుందని మంత్రి తెలిపారు. వచ్చే రెండేళ్లలో 1400 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఉచిత బస్సు ప్రయాణం – ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా సరే

ఇటీవల ఈ పథకానికి సంబంధించి పేరును ప్రభుత్వం స్త్రీ శక్తిగా మార్చిన విషయం తెలిసిందే.

ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ప్రతి మహిళ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించిన సరిపోతుంది.

Minister Ram Prasad Reddy on Stree Shakti free bus travel scheme

అయితే ఉచిత బస్సు సర్వీస్ అంతరాష్ట్ర సేవలో కూడా వర్తిస్తుందా లేదా అనే దాని పైన ప్రభుత్వం ఇంకా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి జిల్లా కి మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి కొన్ని చోట్ల మినహాయింపు ఉంటుంది. ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుమలలో తిరుమలలో నుంచి తిరుపతి వెళ్లే సర్వీసులలో ఈ సౌలభ్యం ఉండదు.

మరోవైపు ఆటో సోదరులకు నష్టం కలగకుండా వారికి మరో కొత్త పథకంతో ముందుకు వస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Click here to Share

One response to “స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం, రాష్ట్రం అంతటా ప్రయాణించవచ్చని మంత్రి కీలక వ్యాఖ్యలు”

  1. L. Sony Avatar
    L. Sony

    Super program cm sir

Leave a Reply to L. Sony Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page