AP Six Step Validation : ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని మీకు సంక్షేమ పథకాలు కట్ అయ్యాయా? అయితే మీకు గుడ్ న్యూస్

AP Six Step Validation : ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని మీకు సంక్షేమ పథకాలు కట్ అయ్యాయా? అయితే మీకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అందించాలంటే ముందుగా సదరు లబ్ధిదారుడు ఆరు అంచెల ధ్రువీకరణ (six step validation)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అలా అయితేనే ఆ లబ్ధిదారునికి లేదా ఆయన కుటుంబం మొత్తానికి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. కుటుంబంలో ఏ ఒక్కరికైనా ఆరు దశల ధ్రువీకరణ ఫెయిల్ అయితే వారికి సంక్షేమ పథకాలు వర్తించవు.

అయితే ఇందులో కీలకమైనటువంటి ఆదాయపు పన్ను [income tax] నిబంధన ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా ఎప్పుడో గతంలో ఒక్కసారి ఆదాయపన్ను చెల్లించి ప్రస్తుతం చెల్లించని వారికి అదే విధంగా వివాహం అయ్యి తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉంటున్న వారికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం ఈ నిబంధన కారణంగా కుటుంబంలో ఎవరికీ కూడా సంక్షేమ పథకాలు అందటం క్లిష్టంగా మారింది. ఈ నిబంధన ఇప్పుడు తొలగించడంతో సంక్షేమ పథకాలు కనీసం అర్హత ఉన్న వారికి అయినా దక్కే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం ఇకపై ప్రభుత్వం జారీ చేస్తే ఆదాయ ధ్రువీకరణ పత్రం మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

Six step validation అంటే ఏం చెక్ చేస్తారు

ఆరు దశల ధ్రువీకరణలో భాగంగా కింది అంశాలలో సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హతను చెక్ చేస్తారు. కింద ఇవ్వబడిన 6 దశల్లో ఏ ఒక్క దానిలో అనర్హత ఉన్న మొత్తం కుటుంబం సంక్షేమ పథకాలకు దూరమవుతుంది.

1. Govt Employee – ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన ఉద్యోగి మరియు అతని కుటుంబం

2. Excess Property in Municipality – మున్సిపాలిటి ప్రాంతంలో పరిమితికి మించి నివాస స్థలం [ చాలా వరకు పథకాలకు 1000 చదరపు అడుగులు మించి స్థలం ఉండరాదు ]

3. Income Tax – ఆదాయపు పన్ను [ ప్రస్తుతం దీనిని తొలగించి ఆదాయ దృవీకరణ పత్రం తప్పనిసరి చేశారు] గ్రామీణ ప్రాంతాల్లో నెలకి 10000, పట్టణాల్లో నెలకు 12,000 మించరాదు.

4. Four Wheeler – నాలుగు చక్రాల వాహనం లేదా కార్ [ అయితే ఆటో టాక్సీ క్యాబ్ వారికి మినహాయింపు]

5. Electricity Consumption – పరిమితికి మించి విద్యుత్ వినియోగం [ గత ఆరు నెలల కాలంలో ప్రతినెల 300 యూనిట్లు మించరాదు]

6. Land – పరిమితికి మించి మెట్ట లేదా మాగాణి భూమి కలిగి ఉండటం . సాధారణంగా మూడు ఎకరాలు మెట్ట పది ఎకరాలు మించి మాగాణీ, మెట్ట మరియు మా గాని కలిపి కూడా 10 ఎకరాలు మించరాదు.

Six step validation ఎలా చెక్ చేసుకోవాలి

6 అంచుల ధ్రువీకరణ చెక్ చేసుకోవడం కోసం కింది లింక్ క్లిక్ చేయండి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page