డిసెంబర్ 9 & 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి లబ్దిదారుల యొద్ద సమాచారం సేకరించనున్నారు.
• దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది.
• తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు, ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు.
• ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించనుంది. ఒక్కో బృందం 40 పింఛన్లను పరిశీలిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్లు తీసుకునేలబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 9, 10 తేదీల్లో తనిఖీలు చేపడుతోంది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్ బ్యాక్ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో త్వరలో ఇదే విధమైన తనిఖీలు చేపట్టనున్నారు. భోగస్, అనర్హులపింఛన్ల విషయంపై వికలాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు పింఛన్ పొందుతున్నట్లు ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులు అందాయి. వాటిని సాకుగా చెప్పి పింఛన్ల వెరిఫికేషన్కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
.పింఛన్ల తనిఖీలకు సంబంధించి షెడ్యూల్, విధి విధానాలను సెర్చ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు జి వీర పాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు.తొలి విడతగా చేపట్టనున్న పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని ఈ నెల 9న ఒక్కరోజే పూర్తి చేసి, 10న సాయంత్రం 5 గంటలకల్లా ప్రభుత్వానికి అధికారులు,సచివాలయ ఉద్యోగులు నివేదిక ఇవ్వాలి. తనిఖీల్లో సచివాలయ సిబ్బందిని కాకుండా పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించింది. ఒక్కో సర్వే బృందం 40 మంది పింఛనుదారులను ప్రత్యక్షంగా కలిసి యాప్ లో వివరాలు సేకరించనుంది.
13 అంశాలతో ప్రశ్నావళి
సామాజిక పింఛన్ల తనిఖీకి వెళ్ళిన బృందానికి ప్రభుత్వం 13 ప్రశ్నలు సూచించింది. ప్రశ్నల వివరాల్లోకి వెళితే..
పింఛనుదారుని స్టేటస్ ను యాప్ లో నివాసం ఉంటున్నారా? మరణించారా?అందుబాటులో లేరు అనే కాలమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లోనైతేరూ.12 వేలు ఆపైన ఉందా?
లబ్ధిదారుని కుటుంబానికి మూడెకరాలు కంటే ఎక్కువ మాగాణి,పదెకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా రెండూ కలిపి పదెకరాల కంటే ఎక్కువ భూమి ఉందా?
కుటుంబంలో ఎవరైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా? (ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటో మినహాయింపు) అవును, లేదు అనే కాలమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
అదే విధంగా కుటుంబంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షనర్ ఎవరైనా ఉన్నారా?
కుటుంబ సరాసరి విద్యుత్ వినియోగం 300యూనిట్ల కంటే ఎక్కువ ఉందా?
మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగులుకంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా?
కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్నుచెల్లిస్తున్నారా?
కుటుంబంలో ఎవరైనా ప్రైవేటుసంస్థల్లో పనిచేస్తున్నారా?
పింఛన్దారువికలాంగత్వం కలిగి ఉన్నారా?
పింఛన్దారుని రీఅసెస్మెంట్కు (వైద్య పరీక్షలకు సిఫార్సుచేస్తున్నారా? ఆయా ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసిన అనంతరం పింఛనుకొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా లేదా అనే వివరాలు తనిఖీ చేసే ఉద్యోగి యాప్లో నమోదుచేయాల్సి ఉంటుంది. అనంతరం పింఛన్దారునిఫొటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుందని ఉద్యోగులకుప్రభుత్వం సూచించింది.
Leave a Reply