ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రజల సంక్షేమ కొరకు మరియు ప్రజల ఆర్థిక అభివృద్ధి కొరకు అమలు చేస్తూ ఉంది. తాజాగా ప్రభుత్వం అక్టోబర్ నుంచి జనవరి వరకు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే కార్యక్రమాల వివరాలను మన సందర్భాలలో ప్రకటించింది. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఏఏ కార్యక్రమాలు ఎప్పటినుంచి ఎప్పటి వరకు జరగనున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
- అక్టోబర్ 16 నుండి 31 వరకు ఆయుష్మాన్ భారత్ Special Drive
- అక్టోబర్ 19 న జగనన్న చేదోడు
- అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు సామాజిక బస్సుయాత్ర
- నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు WHY AP NEEDS JAGAN?
- డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ‘ఆడుదాం ఆంధ్ర’
- జనవరి 1 నుంచి 10 వరకు ‘పెన్షన్ పెంపు’ సంబరాలు
- జనవరి 10 నుంచి 20 వరకు ‘వైఎస్సార్ చేయూత’
- జనవరి 20 నుంచి 30 వరకు ‘వైఎస్సార్ ఆసరా’
ఆయుష్మాన్ భారత్ Special Drive
ఆయుష్మాన్ భారత్, వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల నమోదు, పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 30 వరకు నమోదు ప్రక్రియ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒ.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
జగనన్న చేదోడు
రాష్ట్రంలోని రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు అవసరమైన చేతి పనిముట్లు, వారికి పెట్టుబడి కోసం జగనన్న చేదోడు స్కీమ్ కింద ప్రతి సంవత్సరం రూ.10 వేల సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మూడు విడతల్లో నిధులను విడుదల చేశారు. తాజాగా ప్రభుత్వం నాల్గోవ విడత నిధులను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సామాజిక బస్సుయాత్ర
నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఏం చేశారో చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర ఉంటుంది. తొలి విడత యాత్ర ఇచ్చాపురంలో అక్టోబర్ 26న మొదలై 13 రోజుల పాటు సాగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో బహిరంగ సభను నిర్వహిస్తారు. తొలి విడత బస్సు యాత్ర నవంబర్ 9న అనకాపల్లిలో ముగుస్తుంది. అక్టోబర్ 26 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్సార్సీపీ సామాజిక బస్ యాత్ర ప్రారంభం కానుంది
WHY AP NEEDS JAGAN?
నవంబర్ 1 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్(YCP Needs Jagan) కార్యక్రమం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) వెల్లడించారు.నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10వరకూ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం జరగనుంది.
ఆడుదాం ఆంధ్ర
నవంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు ఆడుదాం ఆంధ్ర పోటీలు జరగనున్నాయి. ముఖ్యంగా వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, క్రికెట్ వంటి పోటీలు ఉంటాయన్నారు. తొలుత గ్రామ, వార్డు స్థాయిల్లో ఆ తర్వాత మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయి.
పెన్షన్ పెంపు సంబరాలు
జనవరి 1 నుంచి అవ్వాతాతలకు, వితంతు అక్క చెల్లెమ్మలకు పింఛన్లు రూ.3వేలకు పెంచే కార్యక్రమం ఉంటుంది అన్నారు. ఈ పెన్షన్ పెంపు కార్యక్రమం పదిరోజులు ఉంటుందని.. గ్రామస్థాయిలో సంబరాలు జరగాలి అన్నారు. అవ్వాతాతల సంతోషంలో అందరూ భాగస్వాములం కావాలి అన్నారు.
వైఎస్సార్ చేయూత
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్‌ను అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద అర్హులైన వారికి మొత్తంగా రూ.75 వేల ఆర్థిక సాయం లభించనుంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకండా ప్రతి ఏటా ఒకసారి విడతల వారీగా లబ్ధిదారులకు చేరుతాయి. ఒక్కో విడత కింద రూ.18750 లభిస్తాయి. తదుపరి విడత చేయూత నిధులను జనవరి 10 నుంచి 20 వరకు విడుదల చెయ్యాలని ప్రభుత్వం ప్రకటించింది.
వైఎస్సార్ ఆసరా
“నవ రత్నాలు” అమలులో భాగంగా, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పేదరికాన్ని నిర్మూలించడానికి మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి సంకల్పం, వైఎస్ఆర్ ఆసర పథకాన్ని 11.09.2020న ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఈ పథకం కింద, 11.04.2019 నాటికి SHGల బ్యాంక్ లోన్ అవుట్ స్టాండింగ్‌లు నాలుగు వాయిదాలలో రీయింబర్స్ చేయబడతాయి.పట్టణ ప్రాంతాల్లో 1,54,956 మంది లబ్ధిదారుల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.
5 responses to “అక్టోబర్ నుంచి జనవరి వరకు జరగబోయే కార్యక్రమాలు”
Ji yar
Jagananna Vidya mariyu vasathi deevena ki sambandinchi em leventi sir
Undavu amma
I want rationcard please arrange me sir
Vasthi devena realse date