జూలై నెలలో అమలు కానున్న ప్రభుత్వ పథకాల వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల కేలండర్ ద్వారా వెల్లడించింది.
జూలై నెలలో అమలు కానున్న పథకాల వివరాలు ఇలా ఉన్నాయి. తేదీల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
- జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత)
- నేతన్న నేస్తం
- ఎంఎస్‌ఎంఈ(MSME) ప్రోత్సాహకాలు
- జగనన్న తోడు (మొదటి విడత)
- వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ)
- వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం)
పైన తెలిపిన పథకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
జగనన్న విదేశీ విద్యా దీవెన
ఏపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సాయన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం కింది లింకును క్లిక్ చేయండి
నేతన్న నేస్తం
ఏపీలోని చేనేత కుటుంబాలలో సొంత మగ్గం కలిగి అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని నేతన్న నేస్తం పథకం ద్వారా నేరుగా నేతన్నలకు అందజేస్తోంది. మరిన్ని వివరాల కోసం కింది లింకును క్లిక్ చేయండి.
ఎంఎస్‌ఎంఈ(MSME) ప్రోత్సాహకాలు
సూక్ష్మ, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పురోగతి లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తున్నది.
జగనన్న తోడు
జగనన్న తోడు కింద అర్హత కలిగిన చిరు వ్యాపారులకు రూ.10 వేలు రుణం అందిస్తుంది. అధిక వడ్డీ భారం నుంచి చిరు వ్యాపారులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మరిన్ని వివరాల కోసం కింది లింకును క్లిక్ చేయండి
వైఎస్సార్ సున్నా వడ్డీ
ఏపీలో డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళల అకౌంట్‌లలో జమ చేస్తుంది. మరిన్ని వివరాల కోసం కింది లింకును క్లిక్ చేయండి
వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా
రాష్ట్రం లోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్ధిక సాయం అందిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం కింది లింకును క్లిక్ చేయండి
Leave a Reply