రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా అమౌంట్ విడుదల..
అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వివాహమైన 10,132 మంది లబ్ధిదారులకు 78.53 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి.
➤ పెళ్లికూతురు తల్లుల ఖాతాలో అమౌంట్ జమ చేయనున్న ప్రభుత్వం. కులాంతర వివాహం చేసుకున్న వారికి మాత్రం పెళ్లి కూతురి ఖాతాలోనే నిధులు జమ.
➤ kalyanamasthu status కింది లింక్స్ ద్వారా check చేయండి
YSR Kalyana Masthu EKYC Dashboard కొరకు క్లిక్ చేయండి New
పై లింక్ లో District -> Mandal -> Secretariat ఎంచుకొని క్లిక్ చేస్తే స్టేటస్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అందులో updation status చెక్ చేయండి
YSR KalyanaMasthu EKYC Dashboard కొరకు క్లిక్ చేయండి New
పై లింక్ లో District -> Mandal -> Secretariat ఎంచుకొని క్లిక్ చేస్తే స్టేటస్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అందులో updation status చెక్ చేయండి
అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు అమలు చేస్తున్నారు . వైఎస్సార్ కళ్యాణమస్తు కింద SC/ST లకు రూ. లక్ష పెళ్లి కానుక ఇవ్వనున్నారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న SC/ST లకు లక్షా 20 వేలు. అలాగే బీసీల పెళ్లిళ్లకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ. 75 వేలు అందజేయనున్నారు. అలాగే ప్రతిభావంతులకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద వైఎస్సార్ కళ్యాణమస్తు కింద రూ.1.50లు ఇవ్వనున్నారు. వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు సాయం చేయబోతున్నట్లు తెలిపింది. భవన నిర్మాణ కార్మికులకు రూ.40వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటాలనే నిబంధనను జీవోలో పొందుపరిచింది ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది.
SN | Category | Existing (in rupees) | Financial Assistance under YSR Kalyanamasthu & YSR Shaadi Tohfa (in rupees) |
1 | Scheduled Caste | 40,000/- | 1,00,000/- |
2 | Scheduled Caste-Inter caste | 75,000/- | 1,20,000/- |
3 | Scheduled Tribe | 50,000/- | 1,00,000/- |
4 | Scheduled Tribe- Inter caste | 75,000/- | 1,20,000/- |
5 | Backward Classes | 35,000/- | 50,000/- |
6 | Backward Classes- Inter caste | 50,000/- | 75,000/- |
7 | Differently Abled | 1,00,000/- | 1,50,000/- |
8 | BOCWWB | 20,000/- | 40,000/- |
► వైఎస్సార్ కళ్యాణమస్తు పథకాన్ని అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నుంచి నవశకం లబ్ధిదారుల మేనేజ్‌మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను అహ్వానిస్తారు.
► వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి వధువు బీసీ , ఎస్సి , ఎస్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి . లేదా భావన కార్మికుల కుటుంబంలో జన్మించి ఉండాలి.
► వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి మాత్రమే అర్హత ఉంటుంది.
► వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు)
► వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి.
► మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు.
► కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోగానీ, ప్రభుత్వ సంస్థల్లో గానీ, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షర్‌గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది.
► నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు).
► నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
► ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.
► మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.
► ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.
☛ మ్యారేజ్ సర్టిఫికేట్
☛ వధువు & వరుడు ఆధార్ కార్డులు.
☛ పెళ్లి ఫోటోలు
☛ పెళ్లి కార్డు ఫోటోలు(ఇన్విటేషన్ కార్డు).
☛ వికలాంగులు అయితే శాశ్వత వికలాంగత్వం ధృవీకరించే సదరం సర్టిఫికెట్
☛ వితంతువు అయితే ముందు భర్త మరణ ధ్రువీకరణ పత్రము, వితంతు పెన్షన్ కార్డు. రెండు లేకపోతే ఆఫీడివిటి
YSR KALYANAMASTHU Eligibility Guildelines | Eligibility Criteria |
---|---|
Eligibile Categories | BC (Backward Castes), Schedule Castes (SC), Schedule Tribes (ST), Minorities (Other than Muslims) and Differently-abled |
Age Criteria | Minimum age for Bride: 18 years as on date of marriage Minimum age for Bridegroom: 21 years as on date of marriage |
Education qualificaiton | Minimum SSC (Relaxation will be given for 30th June 2024) Bride and the Bride groom shall have completed Class X. (This condition is relaxed for marriages conducted up to June 30,2024). |
Number of Marriages | Only 1st Marriage, except in case of widows. |
Total family income (Rs. p.m) 1. Rural 2. Urban | Rural: Rs.10,000/- p.m Urban: Rs.12,000/- p.m Annual income is Rs.1,20,000/- and above in rural areas and annual income is Rs. 1,44,000/- and above in urban areas i.e., towns, cities etc., are not eligible for YSR Kalyanamasthu |
Total family land holding in Acres. | Wet. Less than 3 acres Dry. Less than 10 acres. Both together Max.10 acres. |
Municipal Property. | Propoerty in Municipal Area LESS Than 1000 Sft |
Electricity consumption | Less than 300 units per month (12 months average) |
Government employee / Pensioner | Should not be children of Government Employee / Pensioner (All sanitary workers are exempted). |
Four wheeler | Should not own a FOUR wheeler (Except taxies, tractors, and autos) |
Income tax | Should not be the Children of Iincome tax payee (Income Tax Payee children are not eligible for YSR Kalyanamasthu) |
Total Family Land holdings in Acs | Wet: Less than 3 Acres Dry: Less than 10 Acres Both: Max 10 Acres |
గ్రామ వార్డు సచివాలయం లో అప్లికేషన్ చేసుకోవాలి.
తేదీ 01 అక్టోబర్ 2022 నుంచి ఆన్లైన్ అవకాశం ఉంది. ఇంకా Operational Guidlines రాలేదు.
వరుడికి 21 సంవత్సరాలు. వధువుకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
రెండో మహిళకి రాదు.
2024 జూన్ 30 వరకు పెళ్లి అయ్యే వధూవరులకు ఎటువంటి విద్యా అర్హత అవసరం లేదు. తరువాత కనీసం 10వ తరగతి చదివి ఉండాలి.
అవును. అవసరము. ముందుగా సచివాలయం లో దరఖాస్తు చేసుకొని ఉండాలి
అవసరం అయ్యే అవకాశం ఉంది. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే తెలుస్తుంది.. కావున వధువు వరుడు ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ పెళ్ళికి ముందే లింక్ చేసుకోవాలి..
సచివాలయం ను సందర్శించి ముందుగా వధూవరుల ఆధార్ నెంబర్ తో NBM పోర్టల్ లో Eligibility Criteria చెక్ చేసుకోవాలి. అన్ని సరిగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు..
లబ్ధిదారుని ఆధార్ కు NPCI లింక్ అయిన బ్యాంకు ఖాతా లో మాత్రమే జమ అవుతుంది. మిగతా ఏ బ్యాంకు ఖాతా లో జమ అవ్వదు.