Aadhar biometric: ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి..

Aadhar biometric: ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి..

కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా.. ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్‌ కార్డు (Aadhaar) ఉండాల్సిందే. దాంతో పాటూ వేలిముద్రను కూడా నమోదు చేయాల్సిందే. అయితే ఇలా అవసరమున్న ప్రతి చోటా ఆధార్‌తో పాటు వేలిముద్ర వివరాలు ఇచ్చేస్తుంటాం. వీటినే అదునుగా తీసుకొని కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ మార్గాల ద్వారా వేలిముద్రలను సేకరించి నగదును కాజేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనల గురించి తరచూ వింటూనే ఉన్నాం. వీటి బారి నుంచి తప్పించుకోవటానికి బయోమెట్రిక్‌ను లాక్‌ చేసుకోవడం ఉత్తమం. కావాల్సినప్పుడు అన్‌లాక్‌ కూడా చేయవచ్చు. దీంతో ఇతరులు మీ ప్రమేయం లేకుండా బయోమెట్రిక్‌ని వినియోగించటానికి వీలుండదు. అయితే ఈ లాక్‌/ అన్‌లాక్‌ ఆన్‌లైన్‌లో సులువుగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌

  • దీని కోసం ముందుగా మై ఆధార్‌ పోర్టల్‌లో ఆధార్‌ నంబర్‌, ఓటీపీ ద్వారా లాగిన్‌ అవ్వాలి. (https://myaadhaar.uidai.gov.in/)
  • స్క్రీన్‌పై Lock/Unlock Biometric ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అందులో లాక్‌/అన్‌లాక్‌ ఎలా ఉపయోగపడుతుందనే వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపించే Next ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • వెంటనే Please Select to Lock ఓపెన్ అవుతుంది.  కింద ఉన్న టర్మ్‌ బాక్స్‌లో టిక్‌ చేసి Next పై క్లిక్ చేయాలి.
  • Your biometrics have been locked sucessfully అని స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అంతే మీ ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ అయిపోతుంది. లాక్‌ అవ్వగానే Lock/Unlock Biometric ఆప్షన్‌లో ఎరుపు రంగు లాక్ కనిపిస్తుంది.

అన్‌లాక్ ఇలా..

  • పోర్టల్‌లో లాగిన్ అవ్వగానే Lock/Unlock Biometric ఆప్షన్‌లో ఎరుపు రంగు లాక్ కనిపిస్తుంది. ఇలా ఉంటే మీ బయోమెట్రిక్‌ లాక్‌ అయిందని అర్థం.
  • అన్‌లాక్‌ కోసం పైన చెప్పిన పద్ధతినే ఫాలో అవ్వాలి.
  • అయితే ఇందులో Please Select to Lock టర్మ్‌ బాక్స్‌లో టిక్‌ చేయగానే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. 
  • మీ బయోమెట్రిక్‌ అన్‌లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని అడుగుతుంది. ఇందులో మీకు కావల్సిన ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  • ఎంచుకొని Nextపై క్లిక్ చేయాలి. Your biometrics have been unlocked sucessfully అని స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంతే మీ బయోమెట్రిక్‌ అన్‌లాక్‌ అయినట్టే. 
  • తాత్కాలికంగా అన్‌లాక్ ఆప్షన్‌ ఎంచుకుంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే మీ బయోమెట్రిక్‌ అన్‌లాక్‌ అవుతుంది.

అయితే, ఒకవేళ ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌ చేసినా.. ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్‌ పూర్తి చేసుకోడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

Click here to Share

One response to “Aadhar biometric: ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి..”

  1. Msrinu Avatar
    Msrinu

    Msrinu phone lock karne ka hai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page