ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ, టైలరింగ్ శిక్షణ ప్రారంభిస్తుండగా.. తాజాగా మరో కానుకను అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మహిళా రైడర్ల సేవల్ని ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి మహిళా రైడర్లకు ప్రభుత్వం శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ-బైక్‌లు, ఆటోలు అందజేయనుంది. ఏపీ ప్రభుత్వం శుక్రవారం (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తోంది.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు.
మార్కాపురంలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాు. ఆ జిల్లాకు చెందిన మహిళా రైడర్లకు 10 బైక్‌లు, 10 ఆటోలు పంపిణీ చేస్తారు.. అలాగే జిల్లాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించి ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేస్తారు. ముందుగా ప్రయోగాత్మకంగా 8 నగరాల్లో 1,000 వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే మిగిలిన నగరాలైన విశాఖపట్నం, విజయవాడలో 400 చొప్పున మొత్తం 800 బైక్‌లు, ఆటోలు అందిస్తారు.
ఇక మిగిలిన బైక్‌లు, ఆటోలను నెల్లూరు, గుంటూరులో 50 చొప్పున మొత్తం 100 అందిస్తారు. అలాగే కాకినాడ, రాజమహేంద్రవరం,కర్నూలు, తిరుపతిలో 25 చొప్పున మొత్తం 100 వాహనాలు పంపిణీ చేస్తారు. ఈ వాహనాలను అద్దెకు నడిపేందుకు ర్యాపిడో సంస్థతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యుల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ఈ వాహనాలను అందిస్తుంది
ఏపీ ప్రభుత్వం రాజమహేంద్రవరం, కాకినాడలో చెరో 25 మంది ఎంపిక చేసింది. వీరికి హీరో విడా-వీ2 ప్లస్ ఈ-బైక్ అందిస్తారు.. దీని ఖరీదు రూ.1,22,935 కాగా.. లబ్ధిదారులు ఏ డౌన్‌పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా రుణ సదుపాయంతో ఈ వాహనాన్ని పొందొచ్చు.ఏపీ ప్రభుత్వ మహిళ కోసం తీసుకొస్తున్న శక్తి యాప్‌ను కూడా ఈ వాహనాలకు అనుసంధానం చేస్తున్నారు. అలాగే నెలకు రూ.500 ఇన్‌స్టాల్‌మెంట్ చొప్పున 10 నెలల వరకు ర్యాపిడో సంస్థకు చెల్లించేందుకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఈ పథకం లబ్ధిదారులకు 18 బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తారు.
ఏపీ ప్రభుత్వం మహిళల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకే మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.. ర్యాపిడో సంస్థతో ఈ వాహనాలను అనుసంధానిస్తూ ఒప్పందం చేసుకున్నారు.ర్యాపిడోతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ వాహనాలు నడిపేవారు మొదటి మూడు నెలలూ ఆ సంస్థకు ప్లాట్‌ఫాం ఛార్జీలు చెల్లించక్కర్లేదు అంటున్నారు. ఈ నిర్ణయం ద్వారా మహిళల ఉపాధికి ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.
Leave a Reply