Bangaru Kutumbam: పేదరిక నిర్మూలనలో భాగంగా పీ-4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాల దత్తతకు సంబంధించి ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఎంపికైన వివిధ వర్గాలకు చెందిన బంగారు కుటుంబాలకు అవసరమైన సాయం అందించేలా మొత్తం 24 శాఖలు బాధ్యత తీసుకోవాలని పేర్కొంది.
అసలు P4 పథకం అంటే ఏమిటి? Bangaru Kutumbam: బంగారు కుటుంబం సర్వే, రిజిస్ట్రేషన్, అర్హతలు, తుది జాబితా, బెనిఫిట్స్
బంగారు కుటుంబాల పథకానికి సంబంధించి శాఖల వారీగా బాధ్యతలు
వ్యవసాయ శాఖ: బంగారు కుటుంబాలుగా గుర్తించిన తక్కువ ఆదాయం కలిగిన రైతు, పాడి రైతుల కుటుంబాలకు అభ్యుదయ రైతుల ద్వారా ఉత్తమ వ్యవసాయ యాజమాన్య విధానాలు, అధిక దిగుబడులపై అవగాహన కల్పించడం ద్వారా ఉత్పాదకత పెంచుకుని అధిక ఆదాయం సాధించేలా చూడాలి.
విత్తన, ఎరువులు, పురుగుమందుల డీలర్లు: నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటు ధరకు ఇవ్వడంతోపాటు వాటిని వాడే విధానం తెలియజేయాలి.
ఆహార శుద్ధి, కోళ్లు, మత్స్య రంగంలోని పారిశ్రామికవేత్తలు: పేద కుటుంబాలు, కార్మికులు తమ ఆదాయం పెంచుకునేలా శిక్షణ, సహాయం అందించాలి.
పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత కళాశాల, సాంకేతిక విద్యా శాఖలు: ఉపాధ్యాయులు, ఫ్యాకల్టీ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థల ద్వారా ఆర్థికంగా వెనకబడిన విద్యార్థి కుటుంబాలను దత్తత తీసుకుని విద్యాపరమైన మద్దతు, మార్గదర్శనం చేయాలి.
మైన్స్ అండ్ జియాలజీ: కార్మికులు, వారి కుటుంబాలకు వృత్తి పరమైన భద్రత పెంపు, ఆదాయం పెరిగేలా వ్యాపారవేత్తలు బాధ్యత తీసుకునేలా చేయడం.
పౌరసరఫరాల శాఖ: తమ పరిధిలోని డీలర్లు, పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, రైస్‌మిల్లర్లు, ధాన్యం వ్యాపారుల ద్వారా బంగారు కుటుంబాల కింద ఎంపికైన దినసరి కార్మికులు, వ్యవసాయ కూలీల జీవనోపాధి మెరుగుపడేలా చూడాలి.
వైద్య ఆరోగ్య శాఖ: డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా పేద రోగులు, కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ, ముందస్తు జాగ్రత్తలు తెలియజెప్పడం.
గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, ప్రజారోగ్య, పురపాలక ఇంజినీరింగ్ శాఖలు: కాంట్రాక్టర్ల ద్వారా కార్మికుల కుటుంబాల్లోని వారికి నిరంతర ఆదాయం వచ్చేలా నైపుణ్యం పెంపొందించాలి.
జిల్లా పంచాయతీ కార్యాలయం, పురపాలక సంఘాలు, జడ్పీ సీఈవో: సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని దినసరి కార్మికులుగా ఉన్న బంగారు కుటుంబాల్లోని వారి జీవనోపాధి మెరుగుపరిచి ఆదాయ భద్రత కల్పించాలి. పనిచేసే ప్రదేశాల్లో వసతులు మెరుగుపరచాలి. వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
కార్మికశాఖ: దుకాణాలు, మాల్స్, సంస్థలు, బంగారం, వెండి, రత్నాల వ్యాపారుల సహకారంతో సిబ్బంది, కార్మికుల జీవనోపాధి మెరుగుపడేలా చూడాలి.
ఫుడ్ ఇన్స్పెక్టర్లు: హోటళ్లు, రెస్టారెంట్ల ద్వారా బంగారు కుటుంబాలుగా ఎంపికైన వంటశాల, సేవలు అందించే సిబ్బందిలో నైపుణ్యం పెంచి, వారి ఆదాయ సామర్ధ్యాన్ని మెరుగుపరచడం.
వాణిజ్య పన్నుల శాఖ: వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ద్వారా.. సిబ్బంది, కార్మికుల కుటుంబాల జీవనశైలిలో మార్పు తేవడం, జీవనోపాధి పెరిగేలా చూడటం.
సెట్రాజ్, ఎన్జీవోలు, రెడ్‌క్రాస్, రోటరీ, లయన్స్ క్లబ్, మహిళా క్లబ్బులు, సామాజిక కార్యకర్తలు: పేద కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సేవలు అందిస్తూ వారి జీవన ప్రమాణాలు పెరిగేలా చేయడం.
నైపుణ్యాభివృద్ధి అధికారి, ఎంప్లాయ్మెంట్ అధికారి, వికాస్ పీడీలు: నిరుద్యోగ యువతకు అవసరమైన వృత్తి శిక్షణ, కెరీర్ గైడెన్స్, ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా ఉద్యోగాలు ఇప్పించి వారి ఆదాయాన్ని పెంచడం.
పరిశ్రమల శాఖ: చిన్న, మధ్యస్థాయి వ్యాపారవేత్తల ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కుటుంబాలను దత్తత తీసుకుని వారిలో నైపుణ్యాలను పెంచడం, పని ప్రదేశాల్లో వసతులు మెరుగుపరచడం, సమ్మిళిత వృద్ధి చర్యల ద్వారా వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలి.
Leave a Reply