రాష్ట్రంలోని అన్ని సచివాలయంలో ఉన్న పౌరుల అక్షరాస్యత రేటు తెలుసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయంలోని వాలంటీర్ల ద్వారా సర్వే చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు సంబంధించి కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్ లో వాలంటీర్లకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
వాలంటీర్లు ఎడ్యుకేషన్ సర్వే చేయు విధానం:
Step 1 : మొదటగా కింద ఇవ్వబడిన లింకు ద్వారా కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Step 2 : ఇప్పటికే వాలంటీర్లందరికి లాగిన్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత User Name & Password అడుగుతుంది. Username అంటే సచివాలయం కోడ్ + క్లిస్టర్ కోడ్ అని అర్థము. ఉదాహరణకు సచివాలయం కోడ్ 10190303, వాలంటీర్ క్లస్టర్ 2 అయితే అప్పుడు User name 10190303002 అవుతుంది .
వాలంటీర్లు పాస్వర్డ్ మర్చిపోతే forgot password ఆప్షన్ ద్వారా పాస్వర్డ్ ని మార్చుకోవచ్చు. Username వద్ద మీ Username ఎంటర్ చేయాలి. Request Reset Link పై క్లిక్ చేయాలి. మీరు ముందుగా ఇచ్చిన మెయిల్ కు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు
లేదా Home Page లొ ఉన్న Mobile Number Login అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు వాలంటీర్ గా జాయిన్ అయిన సమయం లొ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Captcha కోడ్ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ కు OTP వస్తుంది . ఆ OTP ఎంటర్ చేసాక లాగిన్ అవుతుంది
అంతే కాకుండా WEA/WEPDS లాగిన్ లో HOME PAGE లొ Utility పై క్లిక్ చేయాలి. తరువాత Reset CR Password Of Volunteer పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Cluster Code, Password, Confirm Password ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. Password ఎంటర్ చేసే టైం లొ Small Letter, Capital Letter, Special Character, Number ఉండేలా చూసుకోవాలి.
Step 3 :లాగిన్ అయిన తరువాత వాలంటీర్ క్లస్టర్ పరిధిలో 5-18 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి వివరాలు పేర్లతో చూపిస్తుంది.
Step 4 : ఎవరికి అయితే సర్వే చెయ్యాలో వారి పేరు పై క్లిక్ చేయాలి.ఒక ప్రశ్న చూపిస్తుంది.
వ్యక్తి యొక్క ప్రస్తుత సమాచారం తెలియజేయండి?’
- రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు
- వ్యక్తి వలస వెళ్ళారు.
- మరణించారు.
- గుర్తించబడలేదు
పై ఆప్షన్లు అనుగుణంగా ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
1. రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు అని సెలెక్ట్ చేస్తే?
ఫస్ట్ ఆప్షన్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు. అంటే మీ సెక్రటేరియట్ పరిధిలోని క్లస్టర్ పరిధిలోని అందుబాటులో ఉంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి.క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ వచ్చి ఏంటంటే 12 వ తరగతి లేక ఇతర సమానమైన తరగతి పూర్తి చేశారా?
12వ తరగతి లేక ఇతర సమానమైన తరగతి పూర్తి చేశారా?
అని అడుగుతుంది. ఇంటర్ లేదా ఇంటర్ కు సమానమైన కోర్స్ పూర్తి చేసినట్లయితే అప్పుడు మాత్రమే అవును అని సెలెక్ట్ చేయాలి. లేకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. ఒక వేళ పిల్లలు ఒకటి నుంచి పన్నెండో తరగతి చదువుతూ ఉంటే కాదు అని పెట్టండి. చివరగా సబ్మిట్ చేయాలి
2. వ్యక్తి వలస వెళ్ళారు.
నెక్స్ట్ ఆప్షన్ వ్యక్తి వలస వెళ్లారు. ఒక వేళ ఈ వ్యక్తి ని సెక్రటేరియట్ పరిధి లో గాని క్లస్టర్ పరిధిలో గానీ అందుబాటులో లేకుండా ఉంటే అప్పుడు వాళ్ళ ని వ్యక్తి వలస వెళ్లారని సెలెక్ట్ చేయాలి. చివరగా సబ్మిట్ చేయాలి
3.మరణించారు.
వ్యక్తి మరణించి ఉంటే మరణించారు అని సెలెక్ట్ చేయాలి. చివరగా సబ్మిట్ చేయాలి
4. గుర్తించబడలేదు
గుర్తింప బడలేదు అంటే ఒక వేళ మీ క్లస్టర్ పరిధిలో లేని మీ సెక్రటేరియట్ పరిధిలో కూడా లేని స్టూడెంట్స్ గాని, వ్యక్తులు గాని ఎవరైనా మీ క్లస్టర్ అనుకుంటే వాళ్ళ ని గుర్తించబడలేదు అని సెలెక్ట్ చేయాలి. చివరగా సబ్మిట్ చేయాలి.
100% GER Badge సమాచారం
కొత్తగా అప్డేట్ అయినా CR మొబైల్ అప్లికేషన్ లో “100% GER Badge” ను Add చేయటం జరిగింది. GER 100% పూర్తి చేసిన వాలంటీర్లు, WEA & WEDPS వారికి ఈ బ్యాడ్జ్ ఇవ్వటం జరుగుతుంది. GER అనగా ఆంగ్లం లొ GROSS ENROLMENT RATION అనగా స్థూల నమోదు నిష్పత్తి, అంటే చదువుకోవలసిన వయసు కల పిల్లల మొత్తంలో ఎంతమంది పిల్లలు ప్రస్తుతం చదువుతున్నారు అనే విషయాన్ని తెలుపుతుంది. చదువుకోవలసిన పిల్లలు అందరూ కూడా ప్రస్తుతం విద్యాసంస్థల్లో జాయిన్ అయి చదువుతున్నట్లయితే అప్పుడు 100% GER సాధించినట్టు అర్థం.
వాలంటీర్లు బ్యాడ్జ్ పొందుటకు అర్హతలు
వాలంటీర్ వారి క్లస్టర్ పరిధిలో ఇవ్వబడిన అందరికీ సర్వే పూర్తి చేసిన తరువాత, సంబంధిత డిపార్ట్మెంట్ వారు మూల్యాంకనం పూర్తి అయిన పిదప వలస లో ఉన్న, మరణించిన, గుర్తుపట్టలేని పిల్లలు మినహా సంబంధిత వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఉన్న మిగతా పిల్లలు అందరూ కూడా ఏదైనా విద్యాసంస్థలో జాయిన్ అయినట్టయితే అప్పుడు సంబంధిత వాలంటీర్ కు పసుపు రంగు బ్యాడ్జీ ఇవ్వటం జరుగుతుంది.
WEA/WEDPS వారు బ్యాడ్జ్ పొందుటకు అర్హతలు
సచివాలయ పరిధిలో వాలంటీర్లు అందరూ కూడా 100% GER Badge పొందినట్టు అయితే అప్పుడు పసుపు రంగు GER బ్యాడ్జ్ ను వారి సచివాలయం సాధించినట్టు అర్థము.
Pending list:
మీ క్లస్టర్ పరిధిలో ఉన్న 5 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు అందరూ ఇక్కడ కనిపిస్తారు.
వ్యక్తి యొక్క పస్ర్తుత సమాచారం తెలియజేయండి?
● మీ క్లస్టర్ పరిధిలో ఉన్న వ్యక్తులయొక్క సమాచారాన్ని ఇక్కడ ఇచ్చిన నాలుగు” Options” లో ఒక దానిని Select చేసి Submit చేయండి.
● రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు అని select చేసినప్పుడు మాత్రమే 12 వ తరగతి లేదా ఇతర
సమానమైన తరగతి పూర్తిచేశారా అని అడగడం జరిగింది.
- ఒక వేళ ఆ వ్యక్తి 12 వ తరగతి లేక ఇతర సమానమైన తరగతులు (ITI,IIIT, Polytechnic and others) పూర్తిచేసినట్లైతే “అవును” పెట్టండి.
- ఒకవేళ ఆ వ్యక్తి 1 నుండి 12 తరగతి మధ్య చదువుతూ ఉంటే, 12 తరగతి పూర్తికాలేదు కాబట్టి” కాదు అని పెట్టండి.
ఈ క్రిందిScreenshot లో చూపిన విధంగా మీరు ఒక వ్యక్తియొక్క సర్వే పూర్తిచేసిన తరువాత ఆ వ్యక్తి యొక్క పేరు దగ్గర టిక్ మార్క్ Enable అవుతుంది.
Completed list:
ముఖ్య గమనిక : మీరు సర్వే పూర్తి చేసినప్పటికీ ఇక్కడ చూపిన విధంగా completed list నందు “no records found” అని కనిపిస్తాయి. కేవలం మీరు చేసిన సర్వే సంబంధిత అధికారిచేత “Verify” చేయబడిన తరువాత మాత్రమే మీ క్లస్టర్ పరిధిలో ఉన్న వ్యక్తులు completed list నందు కనిపిస్తాయి.
అప్లికేషన్ కిసంబంధించిన టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉంటే ఈ క్రింది నంబర్స్ ని సంప్రదించండి.
Timings: Mon-Sat( 9AM-6PM)
Technical Support Details
Email at: support@vsws.co.in
Contact Numbers: 9154409663, 9154372352, 9154409886, 9154409884
Leave a Reply