Caste Survey Process – కుల గణన సర్వే చేయు విధానము

  • కుల గణన సర్వే పూర్తిగా  GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో చెయ్యాలి.
  • వాలంటీర్ లాగిన్ లో మాత్రమే సర్వే చేయల్సి ఉంటుంది. సిటిజెన్, సచివాలయ ఉద్యోగులు , వాలంటీర్ల eKYC అయితేనే సర్వే అవుతుంది .
  • గతంలో వాలంటీర్ వారి యొక్క ఆధార్ నెంబరుతో లాగిన్ అయ్యేవారు కానీ కొత్తగా అప్డేట్ అయిన మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్ యొక్క 8 అంకెల CFMS ID ద్వారా లాగిన్ అవ్వవలసి ఉంటుంది.
  • సర్వే నవంబర్ 27 న మొదలు అయ్యి వారం రోజుల వరకు ఉంటుంది . 

Step 1 : మొబైల్ అప్లికేషను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయాలి

Step 2 : ఓపెన్ చేసిన తర్వాత వాలంటీర్ యొక్క CFMS ID ను ఎంటర్ చేసి Login పై క్లిక్ చేసిన తరువాత వాలంటీర్ యొక్క Biometric / Face / Irish  ద్వారా లాగిన్ అవ్వాలి. 

Step 3 : లాగిన్ అయిన తర్వాత హోం పేజీలో కుల గణన సర్వే అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : తరువాత పేజీలో వాలంటరీ క్లస్టర్ పరిధిలో ఉన్న 

  1. మొత్తం కుటుంబాలు 
  2. పూర్తి అయిన కుటుంబాలు 
  3. పాక్షికంగా పూర్తి చేసినవి 
  4. మిగిలిపోయిన కుటుంబాల 

సంఖ్యను చూపిస్తుంది దాని ఆధారంగా వాలంటరీ ఎన్ని చేశారు ,ఎన్ని చేయలేదు అనే విషయాలు తెలుస్తుంది. ఆ వివరాలు కిందనే Search With Name ద్వారా లేదా Scroll చేయడం ద్వారా క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాల వివరాలు చూపిస్తుంది. అందులో Status – Pending అని ఉన్నవి ఇంకా పూర్తి అవ్వనట్టు , Status –  Completed అని ఉన్నవి సర్వే పూర్తి చేసినట్టు అర్థము. Status – Pending అని ఉన్న వాటిలో ఎవరికైతే సర్వే చేయాలనుకుంటున్నారో ఆ కుటుంబ హౌస్ హోల్డ్ ఐడి పై క్లిక్ చేయాలి. 

Step 4 : తరువాతి పేజీలో ఆ కుటుంబానికి సంబంధించి రెండు Section లు చూపిస్తుంది Section – 1 మరియు Section – 2 .Section – 1 లో హౌస్ ఓల్డ్ డీటెయిల్స్ చూపిస్తుంది Section – 2 లో కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల పేర్లు మనకు చూపిస్తుంది . ముందుగా Section – 1 హౌస్ హోల్డ్ డీటెయిల్స్ పై   Pending   పై క్లిక్ చేయాలి.  

Pending పై క్లిక్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల జీవన స్థితి  ? అనేది అడుగుతుంది అందులో రెండు ఆప్షన్లో ఉంటాయి 

  1. సర్వే కి అందుబాటులో ఉన్నారు మరియు 
  2. కుటుంబ సభ్యులు అందరూ మరణించి ఉన్నారు అ

ని రెండు ఆప్షన్లో చూపిస్తుంది. సర్వేకి అందుబాటులో ఉన్నారు అని సెలెక్ట్ చేస్తే తరువాత ప్రశ్నలు చూపిస్తుంది. అదే కుటుంబ సభ్యులందరూ మరణించి ఉన్నారు అని చూపిస్తే అంతటితో సర్వే ఆ కుటుంబానికి పూర్తి అవుతుంది. 

Step 5 : తరువాతి పేజీలో సర్వేకు సంబంధించిన ప్రశ్నలను చూపిస్తుంది అందులో మొత్తం 14 రకముల ప్రశ్నలు ఉంటాయి. 

  • జిల్లా, జిల్లా కోడ్,మండలం/ మున్సిపాలిటీ ,గ్రామం, పంచాయతీ  మరియు పంచాయతీ కోడ్ , వార్డు నెంబర్, ఇంటి నెంబర్.
  • కుటుంబ పెద్ద పేరు, ఆధార్ నెంబర్,
  • కుటుంబ సభ్యుల సంఖ్య, Family member పేరు మరియు కుటుంబ పెద్ద తో గల సంబందం, రేషన్ కార్డు నెంబర్.
  • కుటుంబం నివాసం ఉంటున్న ఇళ్లు Type (Kutcha house, Building, Duplex, pucca house etc. 
  • ప్రస్తుతం ఉన్న చిరునామా
  • Toilet facility ఉందా లేదా?
  • మంచి నీరు / త్రాగు నీరు సదుపాయం ఉందా? (Public tap, Borewell, public borewell etc.)
  • Live stock ఏమైనా కలిగి ఉన్నారా? ( ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు etc. )
  • Gas Connection Type (LPG / Kerosene / Fire wood etc.

ముఖ్యంగా 7వ ప్రశ్నలో కుటుంబ పెద్దని ఎంచుకోమని చూపిస్తుంది. వారి ఇంట్లో ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వారిని ఎంచుకొని తరువాతి సెక్షన్లో మిగిలిన వారు కుటుంబ పెద్దతో ఉన్నటువంటి బంధుత్వాన్ని ఎంచుకోవాలి.

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం కుటుంబ ఐడి సంఖ్య వస్తుంది జిల్లా పేరు కోడు ఆటోమెటిగ్గా వస్తాయి మండల మున్సిపాలిటీ నగరపాలక సంస్థ ఆటోమేటిక్గా వస్తుంది పంచాయతీ కోడు సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది ఊరి పేరును ఎంచుకోవాలి.

Step 6 : పై ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానాలు ఎంటర్ చేసిన తరువాత ఇంటిలో అందుబాటులో ఉన్న ఎవరిదైనా ఒకరిది ఈ కేవైసీ తీసుకోవలసి ఉంటుంది. Biometric / Irish / OTP ద్వారా eKYC పూర్తి చేయాలి. వాలంటీర్ సర్వే చేయు సమయంలో అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బంది eKYC తీసుకోవలసి ఉంటుంది. తరువాత ఎవరైతే వాలంటీరు సర్వే చేస్తున్నారు వారు కూడా eKYC చేస్తే ఆ ఇంటికి Section – 1 సర్వే పూర్తి అయినట్టు అర్థము . 

Step 7 : తరువాత Section – 2  ఓపెన్ అవుతుంది. అందులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి కుటుంబ సభ్యుల పేర్లు మరియు వారి పక్కన Pending అని చూపిస్తుంది. ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి పేరు పక్కన ఉన్న   Pending   అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నట్లయితే సభ్యుని జీవన స్థితి ? వద్ద 

  1. జీవించి ఉన్నారు మరియు 
  2. మరణించడం జరిగింది 

అనే రెండు ఆప్షన్లో ఉంటాయి. మరణించినట్టయితే మరణించడం అని ఆప్షన్ పై క్లిక్ చేస్తే Pending కాస్త Completed లోకి వెళుతుంది. అదే జీవించి ఉండి అందుబాటులో ఉన్నట్లయితే జీవించి ఉండటం అని ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఆ వ్యక్తికి సంబంధించి ప్రశ్నలు అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో ఉండే ముఖ్యమైన ప్రశ్నలలో

  1. హౌస్ ఓల్డ్ డేటా ప్రకారం ఈ కేవైసీ పూర్తి అయినదా లేదా ?
  2. తండ్రి లేదా భర్త పేరు
  3. వైవాహిక స్థితి 
  4. కులము 
  5. మతము
  6. విద్యా అర్హత
  7. వృత్తి
  8. వ్యవసాయ భూమి విస్తీర్ణము 

పై వివరములలో ముఖ్యముగా కులముకు సంబంధించి మీరు సర్వే చేస్తున్నటువంటి వ్యక్తి గతంలో ఏపీ సేవా క్యాస్ట్ సర్టిఫికెట్ పొంది ఉన్నట్టయితే అప్పుడు ఆటోమేటిక్ గా కులము చూపిస్తుంది. ఒకవేళ కులము చూపించకపోయినట్టయితే మాన్యువల్ గా కులము మరియు ఉపకులము ఎంచుకోవాలి అదే విధంగా మతమును కూడా ఎంచుకోవాలి. 

Step 8 : పై ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానాలు ఎంటర్ చేసిన తరువాత సర్వే చేస్తున్న వారిది eKYC తీసుకోవలసి ఉంటుంది. Biometric / Irish / OTP ద్వారా eKYC పూర్తి చేయాలి. వాలంటీర్ సర్వే చేయు సమయంలో అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బంది eKYC తీసుకోవలసి ఉంటుంది. తరువాత ఎవరైతే వాలంటీరు సర్వే చేస్తున్నారు వారు కూడా eKYC  చేస్తే ఆ ఇంటికి Section-2 సర్వే పూర్తి అయినట్టు అర్థము.

Click here to Share

3 responses to “Caste Survey Process – కుల గణన సర్వే చేయు విధానము”

  1. Siva Avatar
    Siva

    Sachivalayam staff em work chestunnaru oorike salaries icchi posi stunnaru vaallu ee scheme cheyyocch7ga volunteers antha alusuga kanipistunnara prathidhi volunteers chestey ika sachivalayam lu endhuku

    1. SHAIK MAHABOOBBASHA Avatar
      SHAIK MAHABOOBBASHA

      You are correct bro

    2. Jhony sins Avatar
      Jhony sins

      Meruu edoo continues ga vochhi work chestunnatu build up lu enduku
      5200 kuda waste ey kada pension echhaka eme pani chestunnaru asslu vellu public opinion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page