రైతన్నలకు కేంద్రం శుభవార్త…. కనీస మద్దతు ధర పెంపు

రైతన్నలకు కేంద్రం శుభవార్త…. కనీస మద్దతు ధర పెంపు

రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2024-25 రబీ సీజన్‌కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధర (Minimum Support Price) పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (అక్టోబర్ 18) సమావేశమైన కేంద్ర కేబినెట్…పంటలకు మద్దతు ధరను పెంచేందుకు అంగీకరించింది.

రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు చెల్లిస్తున్న కనీస మద్దతు ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యధికంగా కందులు ధర పెరిగింది. క్వింటాల్‌ కందులు (మసూర్) మద్దతు ధర  425 రూపాయలు పెరిగింది. ఆవాలు, రాప్సీడ్ మద్దతు ధర క్వింటాలుకు 200 రూపాయలు పెరిగింది. కుసుమకు క్వింటాలుకు 150 రూపాయల ఎక్కువ ధర చెల్లించేందుకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.   

గోధుమలు, శనగలు మరియు బార్లీలకు వరుసగా క్వింటాల్‌కు 150 రూపాయలు, 115 రూపాయల చొప్పున పెంచడానికి మంత్రివర్గం ఆమోదం లభించింది. 

మార్కెటింగ్  సీజన్  2024-25 లో రబీ పంటలకు నిర్ణయించిన కనీస మద్దతు ధరలు వివరాలు కింద ఇవ్వబడ్డాయి

రబీ పంటలు – పెరిగిన కనీస మద్దతు ధర వివరాలు:

S.No.CropsMSP RMS 2022-23MSP RMS 2023-24MSP RMS 2024-25Cost* of production RMS 2024-25Increase in MSP (absolute)Return over cost (in per cent)
1Wheat – గోధుమలు2015212522751128150102
2Barley – బార్లీ163517351850115811560
3Gram – గ్రాము523053355440340010560
4Lentil (Masur) – పప్పు (మసూర్)550060006425340542589
5Rapeseed & Mustard – రాప్సీడ్ , ఆవాలు505054505650285520098
6Safflower – కుసుమ పువ్వు544156505800380715052
క్వింటాల్‌కు రూ. లలో

కూలీలు,, ఎద్దులు /యంత్రాలకు చెల్లించే కిరాయి , లీజుకు తీసుకున్నందుకు భూమికి చెల్లించిన కౌలు , విత్తనాలు, ఎరువులు, పోషకాలు , నీటిపారుదల ఛార్జీల వంటి పదార్థాల వినియోగం కోసం జరిగే వ్యయం పనిముట్లు మరియు వ్యవసాయ భవనాలపై తరుగుదల, మూలధనం పై  వడ్డీ, పంపు సెట్ల నిర్వహణ కోసం ఉపయోగించే డీజిల్/విద్యుత్ ధర కుటుంబ శ్రమ ఖర్చులు మరియు లెక్కించబడిన విలువ అయ్యే ఖర్చులు వంటి అన్ని చెల్లించిన ఖర్చులను సూచిస్తుంది. 

జాతీయ స్థాయిలో నిర్ణయించిన సరాసరి ఉత్పత్తి వ్యయం రబీ పంటలకు చెల్లించే కనీస మద్దతు ధర కంటే 1.5 రెట్లు ఎక్కువగా నిర్ణయించాలని 2018-19 కేంద్ర బడ్జెట్ సమయంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 2024-25  రబీ పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించడం జరిగింది. దీనివల్ల రైతులకు సరైన గిట్టుబాటు ధర లభిస్తుంది. గరిష్ట రాబడి రేటు గోధుమలకు 102 శాతం, ఆ తర్వాత రాప్‌సీడ్ మరియు  ఆవాలకు 98 శాతం, కాయ ధాన్యాలకు  60 శాతం, పప్పు ధాన్యాలకు 89 శాతం, బార్లీ పై 60 శాతం, కుసుమకు 52 శాతం  గరిష్ట రాబడి రేటు ఉంటుంది. 

పప్పు ధాన్యాలు, నూనె గింజల దిగుబడి ఎక్కువ చేయడానికి 2014-15 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల పప్పు ధాన్యాలు, నూనె గింజల దిగుబడి పెరిగింది. 2014-15లో 27.51 మిలియన్ టన్నులుగా ఉన్న నూనె గింజల దిగుబడి 2021-22 నాటికి (4 వ  ముందస్తు అంచనాల ప్రకారం ) 37.70 మిలియన్ టన్నులకు చేరింది. పప్పు ధాన్యాల దిగుబడి కూడా ఇదే తరహాలో పెరిగింది. ప్రభుత్వం ప్రారంభించిన విత్తన మినీ కిట్స్ కార్యక్రమం వల్ల రైతులకు నూతన వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. పొలాల్లో కొత్త రకాల విత్తనాలు వేయడం, విత్తన మార్పిడి వల్ల పంట దిగుబడి పెరిగింది.  

2014-15 నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల దిగుబడి గణనీయంగా పెరిగింది. పప్పు ధాన్యాల ఉత్పాదకత హెక్టారుకు 728 కిలోల (2014-15) నుండి 892 కిలోల / హెక్టారుకు (4వ ముందస్తు అంచనా 2021-22) పెరిగింది. పప్పు ధాన్యాల ఉత్పాదకత 22.53% పెరుగుదల నమోదు చేసింది. అదేవిధంగా నూనె గింజల పంటల ఉత్పాదకత హెక్టారుకు 1075 కిలోల (2014-15) నుండి 1292 కిలోల / హెక్టారుకు పెరిగింది (4వ ముందస్తు అంచనా, 2021-22).

ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం పప్పు ధాన్యాలు, నూనె గింజల దిగుబడి పెంచేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నవి. పంట విస్తీర్ణం పెంచడం, ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలు ఉపయోగించడం, కనీస మద్దతు ధర ద్వారా రైతులకు సహకారం అందించి పంట సేకరణ ద్వారా ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుంది. 

 దేశంలో వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణల వినియోగం ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (DAM)ను అమలు చేస్తోంది.   డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ లో భాగంగా ఇండియా డిజిటల్ ఎకో సిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ (IDEA), రైతుల సమగ్ర సమాచారం, యూనిఫైడ్ ఫార్మర్స్ సర్వీస్ ఇంటర్‌ఫేస్ (UFSI), నూతన  సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి  రాష్ట్రాలకు నిధులు అందజేయడం, మహలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్ కాస్ట్ సెంటర్  (MNCFC) ఆధునీకరణ, భూసారం, పంట దిగుబడి పెంచడం లాంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.   నూతన  సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి  రాష్ట్రాలకు నిధులు అందజేయడం (NeGPA) కార్యక్రమం కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ (AI/ML), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT), బ్లాక్ చైన్ మొదలైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ వ్యవసాయ పథకాల  అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వబడతాయి. డ్రోన్ సాంకేతికతను వినియోగించడం జరుగుతోంది. స్మార్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు సహకారం అందిస్తూ వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page