ఆంధ్రప్రదేశ్ లో ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కొత్త నిబంధనలను ప్రభుత్వం తీసుకువచ్చింది.. అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రత్యేకంగా ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ దస్తావేజులు లేదా వాటిల్లోని అంశాలు, లింక్ డాక్యుమెంట్లు, ఈసీ తదితర వాటి ఆధారంగా రిజిస్టర్ కార్యాలయంలో స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఇకమీదట అలా ఉండదు. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై పన్ను చెల్లించినట్లు సరైనా రుజువు చూపిస్తేనే రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
కొత్తగా ఏ నిబంధనలు తీసుకువచ్చారు
ఇక పై రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖాళీ స్థలాలకి అయితే vacant land tax, ఇక ఇల్లు లేదా అపార్ట్మెంట్లకు సంబంధించి ఆస్తి పన్నులు కడుతున్నట్లు రసీదులు చూపిస్తేనే వాటిని మీరు వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం గానీ లేదా అమ్ముకోవడం గాని చేయగలరు. సరైన రసీదులు లేకపోతే రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఇవి లేని పక్షంలో లేఅవుట్ ప్లాన్ లేదా ప్లాన్ అప్రూవల్ కాపీలను జత చేస్తే వాటిని పరిశీలించి చేసే అవకాశం ఉంటుంది.
ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి
ఈ తాజా నిబంధనలు ఏప్రిల్ ఒకటి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే వీటికి సంబంధించి చాలా మందికి ఇప్పటికీ అవగాహన లేదు.
కొంత మంది యజమానులు ఖాళీ స్థలాలు మరియు ఇతర ఆస్తులకు సంబంధించి సకాలంలో పన్నులు చెల్లించనట్లయితే, అటువంటి వారికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు క్రయవిక్రయాలకు ఈ ఉత్తర్వులు ద్వారా అవాంతరాలు కలగనున్నట్లు తెలుస్తుంది.
ఇంకా ఏ నిబంధనలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
జీపీఏ ద్వారా వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు అడంగల్, 1బి కాపీని సబ్‌రిజిస్ట్రార్లు ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇప్పుడు తప్పనిసరిగా అడంగల్, 1బిలో జీపీఏ పొందిన వారి పేర్లు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఇంకా వ్యవసాయ భూములకు సంబంధించి సర్వే నెంబరు డాక్యుమెంట్లలో తప్పుపడితే ఎమ్మార్వో నుంచి ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్ తెచ్చుకొని చూపిస్తే సబ్-రిజిస్ట్రార్ సరి చేయడం జరిగేది అయితే కొత్త ఉత్తర్వుల్లో ఎమ్మార్వో ద్వారా అడంగల్ లో సవరణ చేయించుకుని వస్తేనే తదుపరి ప్రాసెస్ చేయాలని సబ్‌రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా కుటుంబ యజమాని ఒకవేళ చనిపోతే, కొత్త నిబంధనల ప్రకారం పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులకు డాక్యుమెంటరీ స్టేషన్ జరగాలంటే తప్పనిసరిగా లీగల్ హాయిర్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
Leave a Reply