వాలంటీర్స్ అంటే ఎవరు? ప్రశ్నించిన సుప్రీం కోర్టు..ఢిల్లీ హైకోర్టుకు ఏపి వాలంటీర్ కేసు

వాలంటీర్స్ అంటే ఎవరు? ప్రశ్నించిన సుప్రీం కోర్టు..ఢిల్లీ హైకోర్టుకు ఏపి వాలంటీర్ కేసు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒకరు చప్పున గ్రామ వార్డు వాలంటీర్లను గతం లో నియమించడం జరిగింది. అయితే వీరి నియామకం మరియు చట్టబద్దత పై పలు కేసులు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు గతంలో దాఖలు అయ్యాయి.

తాజాగా మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీం కోర్టు వరకు వెళ్ళడం చర్చనీయాంశమైంది .

సుప్రీం కోర్టు వరకు వెళ్ళిన కేస్ ఏది?

వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది కి డైలీ న్యూస్ పేపర్ కొనుక్కునేందుకు గాను వీరికి ప్రతి నెల ప్రభుత్వం 200 రూపాయలు అదనంగా ఇస్తుంది. అయితే ఇందులో ప్రభుత్వం మరియు సంబంధిత ప్రజా ప్రతినిధులు,అధికారులు కేవలం సాక్షి పేపర్ ను మాత్రమే కొనేలా చేస్తున్నట్లు ఓ రిట్ పిటిషన్ గత ఏడాది హైకోర్టు లో దాఖలైంది.

ఆ కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై ఈనాడు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సోమవారం విచారణలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సీఎస్‌ వైద్యనాథన్‌, రంజిత్‌కుమార్‌ హాజరయ్యారు. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ పై హైకోర్టు లో కేసుల విచారణ ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలి చేసేందుకు సుప్రీం కోర్టు నిర్ణయించింది.జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించింది. అయితే ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ కేసు విచారణ ను సోమవారానికి వాయిదా వేసింది.

అసలు ఎవరు ఈ వాలంటీర్స్ అని ప్రశ్నించిన సుప్రీం కోర్ట్

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పలు కీలక ప్రశ్నలను సందించింది.అసలు వాలంటీర్లు ఎవరు, వారి నియామకం ఎలా జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అందుకు ‘ఈనాడు’ తరఫు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, దేవదత్‌ కామత్‌, న్యాయవాది మయాంక్‌జైన్‌లు బదులిస్తూ వాలంటీర్లంతా వైకాపా కార్యకర్తలని, రాజకీయ ఎజెండాతో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కేసును తదుపరి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీం నిర్ణయించింది. అయితే సోమవారం ఈ మేరకు తుది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇటీవల హైకోర్టు లో కూడా ఒక కేసు దర్యాప్తు సందర్భంగా హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. వాలంటీర్స్ కు వీలైతే చట్టబద్దత కల్పించాలని అందులో పేర్కొనడం జరిగింది.

You cannot copy content of this page