ఇక కుల దృవీకరణ పత్రం పర్మినెంట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా సులభతరం, ఉత్తర్వులు జారీ

ఇక కుల దృవీకరణ పత్రం పర్మినెంట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా సులభతరం, ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ఇబ్బందులు పడకుండా వారికి మరింత సౌకర్యం కల్పించేందుకు ఇకపై కుల దృవీకరణ పత్రాన్ని శాశ్వతంగా ఒకేసారి చారి అందించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చారి చేసింది.

అదేవిధంగా ఆదాయ దృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు విద్యాసంస్థలు విద్యార్థులను లేదా లబ్ధిదారులను ఒత్తిడి చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇలా పని చేస్తుంది

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు అమలులో కుల దృవీకరణ పత్రం అనగా caste certificate ది కీలక పాత్ర. ఎందుకంటే ఈ సర్టిఫికెట్ ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కుల ఆధారిత సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సర్టిఫికెట్ పొందినవారు మరల తదుపరి ఏడాది ధ్రువీకరణ సమయంలో ఇబ్బందులను పడుతున్న విషయం ప్రభుత్వం వచ్చింది. గతంలో సర్టిఫికెట్ పొంది ఉన్నప్పటికీ మరల తిరిగి కొత్త సర్టిఫికెట్ తీసుకురమ్మని అధికారులు ఒత్తిడి తీసుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా కుల దృవీకరణ, స్థానికత, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల నిబంధనలకు సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ 469 ని ఆదాయ ధ్రువీకరణ పథకాలకు సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ 484 ను ప్రభుత్వం విడుదల చేసింది.

ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసినటువంటి కులదృవీకరణ పత్రాలకు సంబంధించి డేటాబేస్ మొత్తం మీసేవ, ఏపీ సేవ కేంద్రాలలో భద్రపరిచినట్లు ప్రభుత్వం తెలిపింది. వాటి ద్వారా ఈ సర్టిఫికెట్లను ఎలాంటి విచారణ లేకుండా మళ్లీ జారీ చేసేలా కొత్త నిబంధనలు రూపొందించారు.

ఇది ఎలా పనిచేస్తుందంటే ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం ఎప్పుడైనా జారీ చేసినట్లయితే సంబంధిత లబ్ధిదారుడు గతంలో జారీ చేసిన సర్టిఫికెట్ను ప్రభుత్వ శాఖలకు సమర్పించినప్పుడు ప్రభుత్వ శాఖలు మల్ల తాజా సర్టిఫికెట్లు తీసుకురమ్మని అడగకూడదు. ఆ సర్టిఫికెట్ జీవితకాలం అనగా permanent caste certificate రూపంలో చెల్లుబాటు అవుతుంది. అలాగే మీసేవ ద్వారా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొందిన వారికి ఏ క్యాటగిరీ సేవగా తక్షణమే తాజా దృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం తిరిగి తాహాసిల్దార్ లేదా ఇతర అధికారుల విచారణ చేపట్టాల్సిన అవసరం. ఒకవేళ లబ్ధిదారుడి యొక్క తండ్రి లేదా సోదరులు ఎవరైనా గతంలో కులదృవీకరణ పత్రం పొంది ఉంటే వారి బంధుత్వం ఇప్పుడు వేరుగా ఉందా లేదా నిర్ధారించుకోవడానికి పౌరసరఫరాల శాఖ డేటాబేస్ ద్వారా అనగా రేషన్ కార్డ్ డేటా భద్రపరిచేటువంటి డేటాబేస్ ద్వారా ఈ కేవైసీ పూర్తయితే, ఒకే కుటుంబంలో ఉన్నట్లయితే విచారణ లేకుండానే వెంటనే సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈకేవైసి పెండింగ్ లో ఉన్నవారు వెంటనే గ్రామ వార్డు సచివాలయాల్లో దాని పూర్తి చేసి సర్టిఫికెట్ ను పొందవచ్చు.

ఆదాయ ధ్రువీకరణకు ఆరు దశల వెరిఫికేషన్ సరిపోతుంది

సంక్షేమ పథకాలు మరియు విద్యార్థులకు స్కాలర్షిప్ మరియు ఇతర రాయితీలను ప్రభుత్వం ఆదాయ ధ్రువీకరణ ప్రాతిపదికన అమలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే దారిద్ర రేఖకు దిగువన ఉన్నప్పటికీ కూడా ఆదాయ ధ్రువీకరణ పత్రం అనగా income certificate పొందేందుకు చాలామంది ఇబ్బంది పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది.

ఈ సర్టిఫికెట్ కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులలో మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది.

ఆదాయ ధ్రువీకరణ పత్రానికి అప్లై చేసిన వారికోసం రెవిన్యూ అధికారులు ప్రతిసారి విచారణ చేయకుండా గ్రామ వార్డు సచివాలయాలలో నిర్వహించేటటువంటి ఆరు దశల నిర్ధారణ అనగా six step verification ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వ మాయా శాఖలకు తాజాగా తెలిపింది.

సంక్షేమ, విద్యా మరియు ఇతర శాఖలు తమ పథకాలు అమలు చేసేందుకు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ఒత్తిడి చేయకుండా ఆరు దశల నిర్ధారణ ప్రక్రియనే ఇందుకు వినియోగించుకోవాలని, ఒకవేళ అందులో దరఖాస్తుదారులు ఎంపిక కాకపోతే ఆ శాఖలు సమాచారాన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

టెన్త్ మరియు ఇంటర్ విద్యార్థుల డేటా బేస్ ను విద్యాశాఖలు గ్రామ వార్డు సచివాలయాలకు పంపితే అక్కడ ఆరు దశలు నిర్ధారణ ప్రక్రియతో వారి ఆదాయ స్థాయిని నిర్ధారించడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ విద్యార్థులు అర్హత సాధించకపోతే ఆ వివరాలను ఆయా శాఖలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపించడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ విచారణ చేసి వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. స్కాలర్షిప్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు ఆరు దశల నిర్ధారణ ప్రక్రియ సరిపోతుంది.

ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం జారీ చేసిన సర్టిఫికెట్ల విషయంలో కూడా ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం తెలిపింది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page