రాష్ట్రం లోని దళితులకు సుస్థిర ఆదాయాన్ని సమకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అజయ్, రాష్ట్రప్రభుత్వ పథకమైన ఉన్నతిని అనుసంధానించి ప్యాసింజర్ ఆటోలను, వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే అమల్లోకి తెచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా 4,074 ప్యాసింజర్ ఆటోలను ఇవ్వాలని నిర్ణయించి వాటి సేకరణకు గాను టెండర్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఇందుకు గాను మొత్తం రూ.122 కోట్లు ఖర్చవుతాయని అంచనాలుండగా కేంద్రం ఇచ్చే రాయితీ నిధుల విడుదలకు అనుగుణంగా పథకాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు.
ఇదే పథకం కింద ఎస్సీ రైతులకు రూ.1.50 లక్షల
విలువైన వ్యవసాయ పరికరా ఆటోలకు రాయితీ అందించనున్నారు. స్ప్రేయర్లు, మోటార్ ఇంజిన్లు,బోర్ డ్రిల్లర్లు, మోటార్ రివైండింగ్ మెషిన్లు తదితరాలను ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా2,685 మంది రైతులకు వీటిని అందించనున్నారు.ఇందులో కూడా 50 శాతం రాయితీని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందించనున్నాయి.10 శాతం లబ్ధిదారుని వాటాగా ఉండనుంది.
- పవర్ ఒక్కో వాహనం ఖరీదు రూ.3 లక్షలు
- రాష్ట్ర ప్రభుత్వ రాయితీ: రూ. లక్ష
- కేంద్ర ప్రభుత్వ రాయితీ: రూ.50 వేలులబ్ధిదారుని వాటా 10 శాతం (రూ.30 వేలు)
ఉన్నతి పథకం కింద వడ్డీ లేని రుణం
రాయితీ రుణ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకుఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి నెలవాయిదాల్లో చెల్లింపులు చేసే విధానం అమల్లోకి ఉంది.
దళితులపై బ్యాంకులు వడ్డీ భారం కూడా లేకుండా రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దళితులకు ఆటోలు అందించే పథకాన్ని గ్రామీణ నిర్మూలన సొసైటీ (సెర్ప్)పరిధిలో అమలవుతున్న ‘ఉన్నతి’ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించారు. దీని కింద డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు.
అందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ, లబ్ధిదారుని వాటా పోనూ ఆటో కొనుగోలుకుగాను అవసరమయ్యే మిగతా రూ.1.35లక్షల్ని సున్నా వడ్డీ రుణంగా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. వ్యవసాయ పరికరాలకూ ఇదే విధానాన్ని వర్తింపజేస్తారు.
Leave a Reply