AP Cabinet Key decisions April 2022

AP Cabinet has given key approvals for the various schemes and developmental projects in the state.

రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు మరియు పథకాలకు క్యాబినెట్ ఆమోదం. కాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

  • రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కోసం అమలు చేస్తున్న ‘సున్నా వడ్డీ’ పథకం మూడో ఏడాది కూడా కొనసాగించేందుకు రూ.1,259 కోట్లు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం. ఏప్రిల్‌ 22 న సున్నా వడ్డీ పథకం అమౌంట్ జమ.
  • ఏపి లో కొత్తగా పులివెందుల మరియు కొత్తపేట రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు
  • జిల్లాల పునర్విభజనలో భాగంగా 12 పోలీస్‌ సబ్‌ డివిజన్లు, 16 పోలీస్‌ సర్కిళ్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • జిల్లా పరిషత్‌ల కాల పరిమితి, రిజర్వేషన్లు కొనసాగిస్తూ కేబినెట్‌ నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో కొత్తగా 12 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ తీర్మానం. ఇందులో 7 టీచింగ్‌ పోస్టులు, 5 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి.
  • చిరు ధాన్యాల పంటలను ప్రోత్సహించేందుకు ఏపీ మిల్లెట్ మిషన్‌ పాలసీని 2022-23 నుంచి 2026-27 వరకు కేబినెట్‌ ఆమోదించింది.
  • ఏపీ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఒక అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ను, రెండు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • ఏపీ లో ఉన్నత విద్యాశాఖకోసం 253 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్‌ తీర్మానం. ఇందులో 23 ప్రిన్సిపల్‌, 31 టీచింగ్‌ పోస్టులు, 139 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి.
  • రాష్ట్రంలో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల లో 82 ఎకరాలు, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు కోసం 84 ఎకరాల కేటాయింపు.
  • ప్రభుత్వ వైద్యులు ఎవరూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 పోస్టుల భర్తీకి, ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్‌, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page