జూన్ 20 న అన్నదాత సుఖీభవ, అమౌంట్ ఎంతో తెలుసా?

,
జూన్ 20 న అన్నదాత సుఖీభవ, అమౌంట్ ఎంతో తెలుసా?

రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది..  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఈనెల 20న అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava ) అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది.

జూన్ 20 న అన్నదాత సుఖీభవ.. ఏకంగా 7000 జమ

జూన్ 20 వ తేదీన ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ ( గతంలో రైతు భరోసా) కింద అందించేటటువంటి  అమౌంటును జమ చేయనుంది.

పీఎం కిసాన్ కింద 6000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మాట ఇంకా 14 వేల రూపాయలు కలిపి మొత్తం 20వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ రైతుల కథలో మూడు విడతల్లో జమ చేస్తుంది.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ కింద ఎటువంటి అమౌంట్ను రాష్ట్ర వాటా గా రైతుల ఖాతాలో జమ చేయలేదు. అయితే ఎట్టకేలకు రైతుల నిరీక్షణ ఫలించింది. జూన్ 20వ తేదీన పిఎం కిసాన్  విడుదల చేస్తున్న నేపథ్యంలో అదే రోజున రాష్ట్ర వాటా గా 5000 రూపాయలు కలిపి ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మొత్తం 7000 రూపాయలు రైతుల ఖాతాలో జూన్ 20 తేదీన జమ కానుంది.

అన్నదాత సుఖీభవ పధకం – ముఖ్య సమాచారం

అన్నదాత సుఖీభవ పధకాన్ని పొందాలనుకునే రైతు మిత్రులందరూ   Thumb Authentication తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలి.

OTP ద్వారా నమోదు చేసే అవకాశం లేదు. కేవలం Thumb Authentication ఆధారంగా మాత్రమే నమోదు చేయవచ్చు.

కనుక ఈ పధకానికి అర్హత పొందాలంటే, రైతు సేవ కేంద్రం వద్ద మీ Thumb Authentication గుర్తింపు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.

Thumb Authentication నమోదు చేయని రైతులకు పధకం మంజూరుకాదు.

తప్పక రావలసిన విజ్ఞప్తి. మీకు అర్హతలుండి, సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పధకం లబ్ధి పొందగలుగుతారు.

అన్నదాత సుఖీభవ స్టేటస్ ఈ విధంగా తెలుసుకోండి

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు తమ స్టేటస్ ని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కింద ఇవ్వబడినటువంటి వెబ్సైట్లో ఆప్షన్ ని కల్పించింది ఫాలో అవ్వండి.

Step 1: అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://annadathasukhibhava.ap.gov.in/

Step 2: వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు బెనిఫిషరీ స్టేటస్ చూసేందుకు చెక్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి లేదా నో యువర్ స్టేటస్ అని మరొక ఆప్షన్ మీకు పైన కనిపిస్తుంది దానిపైననా మీరు క్లిక్ చేయవచ్చు.

Annadata sukhibhava 2025

Step 3: మీ ఆధార వివరాలు నమోదు చేసి మీ యొక్క అన్నదాత సుఖీభవ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page