Aadhar Pan Link – మీ ఆధార్ తో పాన్ కార్డ్ ని ఈ విధంగా ఆన్లైన్ లో లింక్ చేసుకోండి

,

PAN AADHAR LINKING చివరి తేదీ పొడిగింపు : జూన్ 30 వరకు చివరి అవకాశం

పాన్ కార్డు తో ఆధార్ కార్డ్ ను లింక్ చేసుకొనే ప్రక్రియకు మార్చి 31 ,2023 తో గడువు ముగుస్తుండగా కేంద్రం జూన్ 30 వరకు పొడిగించింది.. ఇంకా పెండింగ్ ఉన్న వారు ఈ డేట్ లోపు ₹1000 ఫైన్ తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే మీ పాన్ కార్డ్ చెల్లుబాటు అవ్వదు.

CBDT ఉత్తర్వుల ప్రకారం ఇది అనివార్యం. అయితే కింద ఇవ్వబడిన కొంత మందికి దీని నుంచి మినహాయింపు ఇచ్చారు.

80 సంవత్సరాలు పై బడిన వృద్దులకు, NRI [Non resident Indians] లకు, అస్సాం, మేఘాలయ, జమ్మూ & కాశ్మిర్ రాష్ట్రాల వారికి ఆధార్ పాన్ లింక్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది.

Aadhar – Pan Link చేసుకోపోతే ఎం అవుతుందో తెలుసా?  

Aadhar – Pan card తో లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డు  గడువు తర్వాత చెల్లుబాటు అవ్వదు. తద్వారా కింది పర్యవసానాలు ఉంటాయి.

  1. మీరు భవిష్యత్తులో పాన్ కార్డ్ ను ఏ లావాదేవీల కు వాడలేరు. బ్యాంక్, డిపాజిట్ తదితర వాటికి ₹50000 మించి transaction చేయలేరు.
  2. మీకు షేర్ మార్కెట్ సంబంధించి ట్రేడింగ్ అకౌంట్ ఉంటే అది పనిచేయదు.
  3. బ్యాంకుల నుంచి 50 వేల కంటే ఎక్కువ డ్రా చేయలేరు.
  4. ఆదాయపు పన్ను రాయితీ, HRA వంటివి వర్తించవు.
  5. మీ పాన్ లేకుంటే మీ ఉద్యోగ రీత్యా చెల్లింపుల కు అవాంతరం ఏర్పడుతుంది. టాక్స్ చెల్లించే ఉద్యోగులకు పాన్ తప్పనిసరి
  6. Income Tax Return ఫైల్ చెయ్యలేరు.
  7. టాక్స్ మొత్తం కూడా భారీగా పడుతుంది

అంటే సింపుల్ గా చెప్పాలంటే పాన్ లేకపోతే ఉండే సమస్యలు అన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి పెండింగ్ ఉన్న వారు ₹1000 ఫైన్ ఉన్నప్పటికీ లింక్ చేసుకోండి.

Aadhar Card – Pan Card Link Status అసలు మీ ఆధార్ పాన్ లింక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి ?

Step 1 : కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయండి

Step 2 : Home పేజీ లో ఉన్నా Link Aadhaar Status పై క్లిక్ చేయండి.

Step 3 : PAN వద్ద PAN కార్డు నెంబర్ ను, Aadhaar Number వద్ద మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి View Link Aadhaar Status పై క్లిక్ చేయాలి. 

Step 3 : Aadhaar కు PAN కార్డు లింక్ ఉంటే Your PAN CTXXXXXX4D is already linked to given Aadhaar 79XXXXXXXX61 ఇలా వస్తుంది. Aadhaar కు PAN కార్డు లింక్ లేకపోతే PAN not linked With Aadhaar. Please Check on Link Aadhaar. Link to link Your Aadhaar With PAN అని చూపిస్తుంది.

పైన మీకు లింక్ అయింది అని ఉంటే ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు. ఒకవేళ లింక్ కాకపోతే కింది విధంగా లింక్ చేసుకోండి.

Aadhar Card – Pan Card Link ఎలా చేయాలి ?

Step 1 : కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 : Link Aadhaar పై క్లిక్ చేయండి.

Step 3 : PAN వద్ద మీ PAN కార్డు నెంబర్ , Aadhaar Number వద్ద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. Validate పై క్లిక్ చేయండి.

తర్వాత మిమ్మల్ని ₹1,000/- పేమెంట్ చేయమని POP-UP వస్తుంది. Continue to Pay Through E-Pay Tax పై క్లిక్ చేయండి.

Step 4 : PAN/TAN వద్ద మీ PAN నెంబర్ ను, Confirm PAN/TAN వద్ద తిరిగి PAN నంబర్ ఎంటర్ చేయాలి, Mobile నెంబర్ వద్ద ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి

Step 5 : మీ మొబైల్ కి OTP వస్తుంది. దానిని కింది విధంగా ఎంటర్ చేయండి

Step 6 e-PAY Tax పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Income Tax అని ఉన్న బాక్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. Proceed పై Click చేయాలి.

Step 7 : Assessment Year – 2023-34 & Type Of Payment Mode లో Other Receipt (500) ను సెలెక్ట్ చేసుకోవాలి.  

Step 8 : Continue పై క్లిక్ చేయండి. 1000 పేమెంట్ చూపిస్తుంది. మరలా Continue పై క్లిక్ చేయండి.

Step 9 :తర్వాత మీకు పేమెంట్ పేజి కి వెళ్తుంది. అందులో  Mode of Payment లో Internet Banking / Debit Card / Pay At Bank Counter / RTGS / NEFT / Payment Gateway లో మీరు దేని ద్వారా చేయాలి అనుకుంటున్నారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేమెంట్ చేయాలి.

మీ పేమెంట్ పూర్తి అవుతునే మీ ఆధార్ పాన్ లింకింగ్ process పూర్తి అవుతుంది.

Click here to Share

7 responses to “Aadhar Pan Link – మీ ఆధార్ తో పాన్ కార్డ్ ని ఈ విధంగా ఆన్లైన్ లో లింక్ చేసుకోండి”

  1. గంగారెడ్డి నోముల Avatar
    గంగారెడ్డి నోముల

    ఎలా చేయాలి

  2. Hari Avatar
    Hari

    Nice infromasanu tqqq

  3. V RAMGOPAL Avatar
    V RAMGOPAL

    I have bn following same procedure for adhar pan linking, paid 1000 rupees also. It says that “name mismatching”. I found that the name in PAN is KONAKALLA RAMA RAO, whereas in Adhar it was RAMA RAO KONAKALLA. The PAN authorities are troubling me since last ten days. In Andhra and Telangana, the surnames comes first and real name comes thereafter. What was the wrong committed by me. No PAN authorities are responding. Either CBDT or Union Finance Ministry has to interfere and solve such problems.

    1. Jalay Avatar
      Jalay

      SBI bank nundi payment cheyyocha ela

    2. RAMU PALEPU Avatar
      RAMU PALEPU

      Money return వచ్చిందా మరి….

  4. పాన్ ఆధార్ లింకింగ్ గడువు పెంపు..ఈ డేట్ లోగా లింక్ చేసుకోండి – GOVERNMENT SCHEMES UPDATES

    […] Aadhar Pan Link – మీ ఆధార్ తో పాన్ కార్డ్ ని ఈ వ… […]

  5. Dharmavarapu lakshmana Avatar
    Dharmavarapu lakshmana

    Fancard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page