ఆంధ్రపదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డోర్ డెలివరీ చేసేటటువంటి MDU వాహనాలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. రేషన్ షాప్ కి ప్రజలు వెళ్లకుండా ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తామన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ వాహనాలను ప్రవేశపెట్టింది. అదేవిధంగా mdu ఆపరేటర్లకు కూడా మంచి జీతాలు ఇస్తూ వీటిని నడిపింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వీరిని కంటిన్యూ చేస్తారా లేకపోతే నిలిపివేసి పాత పద్ధతిలో రేషన్ షాప్ వద్దనే తీసుకునే ప్రత్యామ్నాయం కల్పిస్తారా అనే దానిపైన ఇప్పటివరకు సందేహాలు ఉన్న నేపథ్యంలో దీనిపైన ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎండియు వాహనాలను తీసేస్తారా?
సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. ఇంటింటికీ రేషన్ బండి అంటూ వాహనాలు పెట్టడం జరిగిందని కానీ వాటిల్లో రేషన్ తీసుకోవాలంటే రోడ్డు మీదకు వచ్చి అందరూ గంటల తరబడి లైన్లో నిల్చోవాలి. గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, వాళ్ళ ఫ్రీ టైంలో డీలర్ దగ్గరకు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే వాళ్ళు. కానీ ఈ రేషన్ వాహనాల వలన ఆ బండి వచ్చే దాకా ప్రజలు పనులు మానుకుని ఇంట్లో ఉండాలి అని ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఒకింత ఈ రేషన్ వాహనాలను నిలిపి వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా వీటిని పక్షికంగా నడవలేని పరిస్థితిలో ఉన్నవారు లేదా వృద్ధులకు మాత్రమే వినియోగిస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం రేషన్ వాహనాలు రోడ్డులో ఏదో ఒక చోట నిలబడి అందరిని అక్కడికి పిలవడం జరుగుతుంది. డోర్ డెలివరీ అని చెప్పినా వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి వేరేలా ఉంది. అందరూ రోడ్డుమీదకి వచ్చి లైన్లో నిల్చొని రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అదికూడా రేషన్ తీసుకునేందుకు చాలామంది తమ పని మానుకొని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉందని కూడా పేర్కొంటున్నారు.
మొత్తానికి రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లే తెలుస్తుంది. వీటిని పూర్తిగా తొలగిస్తారా లేదా పాక్షికంగా వినియోగిస్తారు అనేది త్వరలో క్లారిటీ రానుంది. అయితే యధావిధిగా వీటిని వినియోగించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అని ముఖ్యమంత్రి మాటలతో క్లారిటీ వచ్చింది.