ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమైంది.
మార్చి నెలలో పెండింగ్ లో ఉన్న పథకాల నగదును విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తుంది. తాజాగా ప్రభుత్వం మార్చి 1 నుండి 19 వరకు అమలు కానున్న పథకాల వివరాలు మరియు ప్రదేశాలను ప్రభుత్వం ప్రకటించింది.
మార్చి నెలలో అమలు కానున్న పథకాలు
మార్చి 1-5: వైఎస్ఆర్ పెన్షన్ కానుక (రాష్ట్ర వ్యాప్తంగా)
మార్చి 01: విద్యా దీవెన (కృష్ణా జిల్లా)
మార్చి 05: ఇన్పుట్ సబ్సిడీ (అన్నమయ్య జిల్లా)
మార్చి 07: వైఎస్సార్ చేయూత (అనకాపల్లి జిల్లా)
మార్చి 10: సిద్ధం! మీటింగ్ (బాపట్ల)
మార్చి 15: వైఎస్సార్ EBC నేస్తం (నంద్యాల జిల్లా)
మార్చి 19: జగనన్న వసతి దీవెన (నెల్లూరు జిల్లా)
ఈ పథకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం
వైయస్సార్ పెన్షన్ కానుక
రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు లింగమార్పిడి చేసుకున్నవారు డప్పు కళాకారులు మరియు కిడ్నీ సమస్య వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతినెల మూడు వేల నుండి పదివేల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం పెన్షన్ కానుక పథకం ద్వారా అందిస్తున్నది. మార్చి నెలకు గాను ఒకటి నుండి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జరగనుంది.
విద్యా దీవెన
రాష్ట్రంలోని పేద మధ్య తరగతి వర్గాలకు చెంది ఉన్నత విద్యను అభ్యసించాలను కునే వారి ఫీజులు చెల్లించడమే ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్ అన్న విద్యార్థి వన పథకాన్ని అమలు చేస్తోంది. 2023 24 విద్యా సంవత్సరానికి గాను తొలివిడత అమౌంట్ను ప్రభుత్వం మార్చి 1వ తేదీన కృష్ణా జిల్లాలోని పామర్రు జరిగే బహిరంగ సభలో జగనన్న విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
ఇన్పుట్ సబ్సిడీ
ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయే రైతులకు ఆ సీజన్ లోపే నష్టపరిహారాన్ని అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సీజన్ సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ నిధులను మార్చి 5న అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా విడుదల చేయనున్నారు
వైయస్సార్ చేయూత
రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు చెందిన మహిళలకు ఏటా 18750 రూపాయలను నాలుగు విడతలుగా మొత్తంగా 75 వేల రూపాయలు అందించి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించింది. చేయూత నాలుగో విడత అమౌంట్ అనకాపల్లిలో జరగబోయే పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
వైయస్సార్ ఈబీసీ నేస్తం
రాష్ట్రంలోని అగ్ర వర్ణ కులాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ ఈబిసి నేస్తం పథకాన్ని ప్రారంభించింది. వైయస్సార్ ఈబిసి నేస్తం పథకం నిధులను మార్చి 15 నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
వసతి దీవెన
రాష్ట్రంలోని ఉన్నత విద్యను అభ్యసించే పేద మధ్య తరగతి విద్యార్థులకు వాహన ఖర్చులు మరియు తదితర ఖర్చులు నిమిత్తం ప్రభుత్వం కొంత నగదును జగనన్న వసతి తెలివైన పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నది. జగనన్న వసతి దీవెన అమౌంట్ను మార్చి 19న నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు.