NPCI మ్యాపర్ అంటే ఏమిటి:
NPCI మ్యాపర్ అనేది నిర్దిష్ట NPCI సంస్థ ద్వారా బ్యాంకుల కొరకు నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక సేవ.
బ్యాంక్‌తో లింక్ చేయబడిన ఆధార్ నంబర్లను నిలువ చేసి బ్యాంకులకు ఆధార్ ఆధారిత చెల్లింపు లావాదేవీలను రూట్ చేయడం కోసం తిరిగి బ్యాంకులకు అవసరం అయినప్పుడు లబ్ధిదారుల ఆధార్ మ్యాప్పింగ్ వివరాలను పంపిస్తుంది. NPCI మ్యాపర్‌లో ఆధార్ నంబర్‌ను సీడ్ చేసిన బ్యాంక్ IIN (ఇష్యూయర్ ఐడెంటిఫికేషన్ నంబర్)తో పాటుగా ఆధార్ నంబర్ ఉంటుంది.
ఎవరు NPCI మాపింగ్ చేయించుకోవాలి?
కింది లింక్ లో మీ NPCI వివరాలలో చూపిస్తున్న బ్యాంక్ మరియు మీరు సంక్షేమ పథకాలకు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ వేరు అయితే మార్చుకోవాలి.
Note : అమ్మ ఒడి పథకం సంబంధించి ప్రభుత్వం విడుడల చేసిన జాబితా లో కూడా NPCI Mapping వద్ద Inactive అని ఉన్నవారు మాత్రమే NPCI మాపింగ్ చేయించుకోవాలి .
అమ్మ ఒడి లిస్ట్ కొరకు క్లిక్ చేయండి
ఆధార్ లింక్ చేసుకుంటే NPCI పూర్తి అయినట్లేనా ?
ఆధార్ ని బ్యాంక్ ఖతా తో లింక్ చేయడం తో NPCI మ్యాప్పింగ్ పూర్తి అవ్వదు.
సంక్షేమ పథకాల నగదు లావాదేవీల కొరకు ఆధార్ సీడింగ్[NPCI Mapping] కూడా చేస్తారు .కొన్ని సార్లు ఆధార్ లింక్ చేసేప్పుడు NPCI మాపింగ్ కూడా చేస్తారు. మీ మాపింగ్ ఆక్టివ్ లో ఉంటె కొత్తగా మాపింగ్ అవసరం లేదు.
Inactive ఉన్న వారు లేదా బ్యాంక్ మార్చుకోవాలి అనుకునే వారు NPCI Mapping కోసం కింది స్టెప్స్ అనుసరించాలి
ఆధార్ NPCI MAPPING చేయు విధానం
- ముందుగా మీ original ఆధార్ మరియు xerox ని తీసుకొని మీ బ్యాంక్ ని సంప్రదించండి
- ఆధార్ ని బ్యాంక్ ఖాతా తో లింక్ చేసి తరువాత NPCI mapping కూడా చేయమని అడగాలి
- వారు మీకు ఆధార్ లింకింగ్ మరియు సీడింగ్ సంబదించిన ఫారం ఇస్తారు.
- ఫారం నింపి , మీ ఆధార్ xerox జత చేసి వారికి ఇవ్వాలి. మీ ఆధార్ ఇచ్చి ఫార్మ్ వారిని నింపమని కూడా అడగవచ్చు
- బ్యాంక్ వాళ్ళు ఆ డేటా ని NPCI కి అప్డేట్ చేస్తారు
- సాధారణంగా 2-3 రోజులలో మీకు NPCI లింక్ అవుతుంది.
గతంలో వేరే బ్యాంకు కి మ్యాప్ అయి ఇప్పుడు వేరే బ్యాంక్ కి మ్యాప్ అయితే ఎలా ?
ఏది లేటెస్ట్ అనగా కొత్తగా సీడింగ్ చేయబడుతుందో దానినే పరిగణలోకి తీసుకుంటారు
Leave a Reply