రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఇటీవల అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ పథకాన్ని మరికొంతమంది లబ్ధిదారులకు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వీరికి దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది
సొంత జాగా ఉంది పక్కా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకునేందుకు మహిళల ఖాతాలో మూడు లక్షల రూపాయలను మూడు దశలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులకు కూడా
గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా లబ్ది పొంది అయితే ఆర్ సి సి రూఫ్ అంటే స్లాబ్ లేకుండా ఇతర పైకప్పు తో నిర్మించుకున్న వారికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇటువంటి వారికి కూడా మరల దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఇప్పటికే 14 లక్షల పైగా దరఖాస్తులు గృహలక్ష్మి పథకానికి రాగా ఇంకా పెరిగే అవకాశం ఉంది.
గృహలక్ష్మి దరఖాస్తు ప్రక్రియ – Gruhalakshmi Application Process
ప్రతి మండలంలో ఉండే తహసిల్దార్ కార్యాలయంలో కానీ లేదా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ద్వారా గడువు లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. సాధారణ లబ్ధిదారులకు ఇప్పటికే గడువు ముగిసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు ఆర్సిసి గ్రూప్ లేకుండా కట్టుకున్న వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తుంది.
గృహ లక్ష్మీ పథకానికి సంబంధించి ఎవరికీ డబ్బులు కానీ లంచం కానీ ఇవ్వరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గృహలక్ష్మి పథకానికి అర్హతలు మరియు మార్గ దర్శకాలు ఇవే
- సొంత జాగా ఉండి రెండు గదులతో RCC ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం సహాయం చేయనుంది
- మహిళ పేరు మీద ఈ సహాయం అందిస్తారు
- ప్రతి నియోజకవర్గానికి 3,000 మందికి చొప్పున స్టేట్ రిజర్వ్ కోటా లో 43000 మందికి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తారు.
- జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి స్థాయిలో కమిషనర్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు అవుతుంది
- ఈ పథకానికి మహిళ పేరిట ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉంటుంది. జన్ ధన్ ఖాతాను ఇందుకు ఉపయోగించకూడదు
- ఇంటి బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ లెవెల్ ఇలా మూడు దశల్లో అమౌంట్ ను అందిస్తారు
- ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం ఇక బీసీ మైనార్టీలకు 50 శాతం కోట తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు
- వీటికి సంబంధించి దరఖాస్తులను కలెక్టర్స్ పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ద్వారా దశలవారీగా అమౌంటును పంపిణీ చేస్తారు.
అయితే ఆహార భద్రత కార్డ్ ఉండి సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆర్సీసీ రూఫ్ స్లాబ్ తో ఇల్లు ఇప్పటికే ఉన్నవారికి లేదా జీవో 59 కింద లబ్ధి పొందిన వారికి ఈ పథకం వర్తించదు.
Follow us on Telegram for regular updates
Leave a Reply