రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ 14 వ విడత అమౌంట్ ను ప్రధాని మోడీ గురువారం విడుదల చేశారు. రాజస్తాన్ లోని సికార్ వేదిక గా రైతుల ఖాతాలో 2 వేల చప్పున అమౌంట్ జమ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో మీ ఖాతాలో అమౌంట్ జమ అయిందా లేదా తెలుసుకునేందుకు Studybizz ద్వారా పోల్ నిర్వహించడం జరుగుతుంది. ఇది రైతుల అవగాహన కోసం నిర్వహించడం జరుగుతుంది.
పిఎం కిసాన్ సంబంధించి మీ స్టేటస్ ను చెక్ చేయండి
✓ PM కిసాన్ మీ స్టేటస్ ని ఇలా చెక్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి మీరు అసలు ఎలిజిబిల్ అవునా కాదా ? మీ ఈ కేవైసీ పూర్తయిందా? అదేవిధంగా మీ పేమెంట్ స్టేటస్ వివరాలు అన్ని మీరు కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేయవచ్చు.
పై లింకు ద్వారా మీరు మీ వివరాలు అదేవిధంగా, దాని తర్వాత ఎలిజిబిలిటీ స్టేటస్ అంటే మీ అర్హత మరియు కింది విధంగా పేమెంట్ స్టేటస్ వివరాలు అన్నీ చెక్ చేయవచ్చు.
✓ PM కిసాన్ జాబితా లో మీ పేరు చెక్ చేయండి
జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
✓ PM కిసాన్ EKYC పూర్తి అయ్యిందా లేదా సరి చూసుకోండి
PM కిసాన్ EKYC కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
✓ మీ బ్యాంక్ ఆధార్ కి NPCI లింక్ అయిందా లేదా సరి చూసుకోండి
బ్యాంక్ NPCI మ్యాపింగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
పైన పేర్కొన్న అన్ని లింక్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు అర్హత ఉన్నట్లయితే మీకు తప్పకుండా అమౌంట్ పడుతుంది. అయితే పేమెంట్ స్టేటస్ అప్డేట్ అవ్వడానికి రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది
ఇప్పటికీ మీకు అమౌంట్ జమ కాకపోతే మీ సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు లేదా పిఎం కిసాన్ నంబర్స్ కి ఫోన్ చేయవచ్చు. ఈ విడత లో భాగంగా ప్రతి రైతు ఖాతాలో 2000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఎవరికైతే గత విడతలో ఈ కేవైసీ పెండింగ్ ఉన్న కారణం ద్వారా జమ కాలేదో వారికి ఒకవేళ ఇప్పటికి ఈ కేవైసీ పూర్తయినట్లయితే రెండు విడుదల అమౌంట్ కలిపి నాలుగు వేల రూపాయలు వారి ఖాతాలో జమవుతాయి.
పీఎం కిసాన్ ఇతర అన్ని లింక్స్ కొరకు కింది పేజ్ ని చెక్ చేయండి.
Leave a Reply