Jagananna Suraksha: ముమ్మరంగా జగనన్న సురక్ష క్యాంపులు..ఇప్పటికే 10.86 లక్షల వినతుల పరిష్కారం, మీ క్యాంప్ డేట్ చెక్ చేయండి

Jagananna Suraksha: ముమ్మరంగా జగనన్న సురక్ష క్యాంపులు..ఇప్పటికే 10.86 లక్షల వినతుల పరిష్కారం, మీ క్యాంప్ డేట్ చెక్ చేయండి

రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు మరియు సర్టిఫికెట్ల జారీలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రారంభించిన టువంటి జగనన్న సురక్ష పథకం ద్వారా ఇప్పటివరకు 10.86 లక్షల వినదు పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే 3339 సచివాలయాలు, 10.82 వినతులు

రాష్ట్రవ్యాప్తంగా 15004 సచివాలయాలు ఉండగా, ఇందులో ఇప్పటివరకు 3339 సచివాలయాలలో క్యాంపులు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రజల నుంచి మొత్తం 13.10 లక్షల వినతులు అందగా ఇందులో 80 శాతం అనగా 10.86 లక్షల వినతులను వెంటనే పరిష్కరించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈనెలాఖరు వరకు సచివాలయాలలో క్యాంపులు

అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద జూలై 1న ప్రారంభమైనటువంటి జగనన్న సురక్ష క్యాంపులు జూలై 31 వరకు కొనసాగనున్నాయి.

ఈ క్యాంపులలో మండల స్థాయి అధికారులు రెండు విభాగాలుగా ఏర్పడి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.

ఎటువంటి రుసుము లేకుండా సర్టిఫికెట్లు, రేషన్, పెన్షన్ సహా ఇతర సమస్యలు

ఈ నాలుగు వారాల పాటు నిర్వహించే ఈ క్యాంపు లలో ప్రజలకు కావలసినటువంటి ముఖ్యమైన సర్టిఫికెట్లు , ఆధార్ సేవలు, కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ కార్డుల విభజన, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, కౌలు రైతులకు సిసిఆర్సి కార్డుల వంటి ముఖ్యమైనటువంటి సర్వీసులను పూర్తి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.

List of focused services

ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సచివాలయంలో సంప్రదించండి

మీకు సంక్షేమ పథకాలు అర్హత ఉన్నా అందరికపోయినా, సర్టిఫికెట్ల జారీలో సమస్యలు ఉన్నా, హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ డేటాలో తప్పులు ఉన్న లేదా రేషన్ కార్డు విభజన జరగకపోయినా ఇటువంటి అన్ని ప్రధాన సమస్యలను క్యాంపుల ద్వారా వెంటనే పరిష్కరిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే ద్వారా సమస్యలను గుర్తించినటువంటి వాలంటీర్ల బృందం సమస్యలు ఉన్న వారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నారు.

ఎవరైనా నేరుగా వెళ్లినా లేదా వాలంటీర్ ద్వారా వెళ్లినా అప్పటికప్పుడు నమోదు చేసి టోకెన్లు కూడా జారీ చేస్తున్నారు.

మీ సచివాలయంలో ఎప్పుడు సురక్ష క్యాంపు నిర్వహిస్తారు? అన్ని ఫార్మ్స్ మరియు లింక్స్ కింది పేజ్ లో చెక్ చేయండి

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page