➤ జగనన్న సురక్ష లో భాగంగా చేదోడు సంబంధించి గ్రీవెన్స్ పెట్టీ, సిక్స్ స్టెప్ ధ్రువీకరణ పూర్తి అయి అర్హత ఉన్న లబ్ధిదారుల వివరాలు సచివాలయం BOP యాప్ లో వెరిఫికేషన్ కొరకు ఇవ్వబడ్డాయి
➤ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, బర్త్, ఇన్కమ్, మ్యారేజ్ సర్టిఫికెట్, కొత్త రేషన్ కార్డ్, రేషన్ కార్డు విభజన, ఆధార్ లో మొబైల్ అప్డేట్ వంటి సేవలు పూర్తిగా ఉచితం
➤ రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజుల పాటు ఈ కార్యక్రమం
➤ Camp Schedule తేదీనకు 7 రోజుల ముందు మాత్రమే సర్వే open అవుతుంది. కుటంబ సభ్యుల యొక్క photo ని capture చెయ్యాలి. Capture చేసిన తరువాత ఆ household సంబంధించిన latitude and longitude వివరాలు నమోదు కావడం జరుగుతుంది. Household సంబంధించిన కుటంబ సభ్యుడు/ సభ్యురాలు యొక్క eKYC ని Biometric/IRIS/Facial option select చేసుకొని పూర్తి చేయాలి.
Jagananna Suraksha Volunteer SurveyNew
Jagananna Suraksha Certificate wise IssuesNew
Jagananna Suraksha Pension IssuesNew
Download GSWS Volunteer App New
Jagananna Suraksha Program Volunteer App User Manual New
Jagananna Suraksha Program Mee Seva Services User Manual New
ప్రజల సమస్యలకు సంబంధించి జగనన్న సురక్ష పథకం ద్వారా ఏర్పాటు చేసే క్యాంపులను జులై 1 నుంచి నిర్వహించనున్న ప్రభుత్వం.. జూన్ 24 నుంచి వాలంటీర్లు, సిబ్బంది ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం , సమస్యల నమోదు
Step 1 : మీ సచివాలయ పరిధిలో ఏ రోజు జగనన్న సురక్ష క్యాంపు ఉంటుందో తెలుసుకోవటానికి ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి.
Step 2 : Home Page Know your Jagananna Suraksha camp date అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
Step 3 : తరువాత ఆయా సచివాలయ పరిధికి సంబంధించిన వ్యక్తి యొక్క ఆధార నెంబర్ లేదా సచివాలయం ఉన్నటువంటి జిల్లా మండలం గ్రామమును సెలెక్ట్ చేసి Check Status పై క్లిక్ చేయాలి. వెంటనే సచివాలయం పేరు, మీ యొక్క సచివాలయం కోడు, సచివాలయం యొక్క షెడ్యూల్ తేదీ చూపించడం జరుగును.
Step 1 : గ్రామ వార్డు వాలంటీర్లు GSWS Volunter కొత్త వెర్షన్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లింక్
Step 2 : జగనన్న సురక్ష ప్రోగ్రాం లో భాగంగా GSWS Volunteer కొత్త వెర్షన్ మొబైల్ అప్లికేషన్ లొ Home Page లొ Suraksh అనే ఆప్షన్ ఇవ్వటం జరుగును . ఆ ఆప్షన్ టిక్ చేసాక క్లస్టర్ లొ హౌస్ హోల్డ్ డేటా వస్తుంది.
Step 3 : ఎవరికి అయితే సర్వే చెయ్యాలో ఆ కుటుంబ పెద్ద పేరును సెలెక్ట్ చేసుకోవాలి. ఆరు దశల ధ్రువీకరణ వివరాలు అనగా
చూపిస్తాయి. తరువాత వరుసగా ప్రశ్నలు చూపిస్తాయి.
ప్రశ్న 1 : రైతులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం జగనన్న ప్రారంభించిన పథకాలు ఏంటో తెలుసా? (పౌరుడు తన సమాధానం చెప్పాక కింద ఉన్న అన్ని ఆప్షన్స్ ని చదవండి)
అవగాహన లేనివారికి తెలియజేయండి.
ప్రశ్న 2 : మహిళల జీవనోపాధి కోసం జగనన్న ప్రారంభించిన పథకాలు ఏంటో తెలుసా? (పౌరుడు తన సమాధానం చెప్పాక కింద ఉన్న అన్ని ఆప్షన్స్ ని చదవండి)
అవగాహన లేనివారికి తెలియజేయండి.
ప్రశ్న 3 : మన పిల్లల భవిష్యత్తు కోసం జగనన్న అందిస్తున్న పథకాలు ఏంటో తెలుసా? (పౌరుడు తన సమాధానం చెప్పాక కింద ఉన్న అన్ని ఆప్షన్స్ ని చదవండి)
అవగాహన లేని వారికి తెలియజేయండి.
ప్రశ్న 4 : మీరు ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి.
ప్రశ్న 5 : జగనన్న ప్రారంభించిన ప్రభుత్వ పథకాలు మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడ్డాయని భావిస్తున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి.
ప్రశ్న 6 : గత ప్రభుత్వం కంటే జగనన్న ప్రభుత్వంలో మీకు ఎక్కువ మేలు జరుగుతోందని మీరు నమ్ముతున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి
మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు "జగనన్న సురక్షా" అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు మీ సచివాలయంలో ఒక రోజు గడిపి, సంక్షేమ పథకాలు, ధృవీకరణ పత్రాలకు సంబంధించి మీకు ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తారు.___________తేదీన జగనన్న సురక్షా శిబిరం మన సచివాలయంలో నిర్వహిస్తారు. ప్రభుత్వ పథకాలు, ధృవీకరణ పత్రాలకు సంబంధించిన సమస్యలకు అక్కడిక్కడే పరిష్కారం పొందవచ్చు.
ప్రశ్న 7 : ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి.
ప్రశ్న 8 : పై ప్రశ్నకు (ప్రశ్న 7 కు) మీ సమధానం 'అవును' అయితే అది ఏ పథకానికి సంబంధించినది?
ప్రశ్న 9 : మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏ మైనది?
ఇచ్చిన ఆప్షన్ లో ఒక ఆప్షన్ ను ఎంచుకోవాలి. సిటిజన్ చెప్పిన సమస్య ఆప్షన్లో లేకపోతే తరువాత సెక్షన్ 9.1 లొ ఎంటర్ చేయాలి.
ప్రశ్న 10 : అర్హత ఉండి మీ కుటుంబం లో ఎవరైనా పెన్షన్ పొందలేకపోతున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి
కుటుంబంలో ఎవరైనా పెన్షన్ పొందలేకపోతే దానికి కారణం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ చూపించకపోతే అప్పుడు సెక్షన్ 10.1 లొ మాన్యువల్గా ఎంటర్ చేయాలి.సెక్షన్ 10.1.1 లొ ఇంట్లో రెండవ వ్యక్తి ఏ రకపు పెన్షన్కు అర్హులో తెలియజేయాలి.
క్యాంపుకి వారం రోజుల ముందు నుండి వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళాలి
Yes -- NO
Yes -- NO
క్యాంపు గురించి తెలియజేసి సమస్య ఉంటే వారిని సచివాలయం వద్దకి రమ్మని మీ సమస్య పరిష్కరించడం జరుగుతుంది అని తెలియజేయండి
Yes -- NO
ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, అర్హులెవరూ మిగిలిపోకుండా పథకాలను అందించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా, పటిష్టంగా అమలు చేసేందుకు దీన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం తొలిదశలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరిస్తారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అక్కడ ఇంకా ఎవరికైనా అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదా? ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వివిధ రకాల సర్టిఫికెట్లను పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అనే పరిశీలిస్తారు. అంశాలను నిశితంగా
ఆ వివరాలను నమోదు చేసుకుంటారు. ఆ తరువాత వెంటనే రెండో దశ కింద నిర్దేశిత తేదీల్లో మండల స్థాయి అధికారులు ఆయా గ్రామాల్లో సచివాలయాలను సందర్శిస్తారు. అర్హులుగా గుర్తించిన వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అదే రోజు అందచేస్తారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటారు.
జగనన్న సురక్షా ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన లబ్ధి చేకూర్చనున్నారు. ఈమేరకు స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్షా కార్యక్రమం, గడప గడపకూ మన ప్రభుత్వంపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.
ఆ వివరాలను నమోదు చేసుకుంటారు. ఆ తరువాత వెంటనే రెండో దశ కింద నిర్దేశిత తేదీల్లో మండల స్థాయి అధికారులు ఆయా గ్రామాల్లో సచివాలయాలను సందర్శిస్తారు. అర్హులుగా గుర్తించిన వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అదే రోజు అందచేస్తారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటారు.
జగనన్న సురక్షా ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1 చేకూర్చనున్నారు. ఈమేరకు స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్షా కార్యక్రమం, గడప గడపకూ మన ప్రభుత్వంపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్షా కార్యక్రమం గురించి వివరిస్తారు. ఆ ఇంటికి సంబంధించి ఇన్కమ్, మ్యారేజీ, డెత్ సర్టిఫికెట్ల నుంచి ప్రభుత్వ పథకాలను పొందడం దాకా ఏమైనా సమస్యలున్నాయా? అనే అంశంపై జల్లెడ పడతారు. ఒక్కరు కూడా మిస్ కాకుండా అన్ని వినతులు పరిష్కారం కావాలి.
సమస్యలేమీ లేకుంటే కుశల ప్రశ్నలు వేసి వారి ఆశీస్సులు తీసుకుని మరో ఇంటికి వెళతారు. ఇంటింటికి వెళ్లిన సమయంలో ఎవరైనా సర్టిఫికెట్ల సమస్య లేదా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నా, అర్హత ఉన్నా పథకాలు అందడం లేదని గుర్తించినా వివరాలు నమోదు చేసుకుంటారు. అనంతరం నిర్దేశిత తేదీల్లో గ్రామ సచివాలయాలకు వచ్చే మండల స్థాయి బృందాలు, వార్డు సచివాలయాలకు వచ్చే మున్సిపల్ స్థాయి బృందాలు అక్కడికక్కడే సర్టిఫికెట్లను ఇచ్చేస్తాయి.
మండల స్థాయిలో ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్దార్ ఒక బృందంగా, తహశీల్దార్, పంచాయతీరాజ్ ఈవో కలసి రెండో టీమ్ గా ఏర్పాటవుతారు. ఈ రెండు బృందాలు గ్రామాలకు వెళ్తాయి. సచివాలయానికి వచ్చే తేదీ వివరాలను ముందే నిర్ణయించి అప్పటిలోగా గ్రామంలో ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు.
నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటినీ జల్లెడ పడతారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, అర్హతలు తదితరాలకు సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలున్న వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ అందిస్తారు. దీనివల్ల సమస్యలు మళ్లీ ఉత్పన్నం కాకుండా పరిష్కారమయ్యే అవకాశం కలుగుతుంది.
అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది ఒక టీమ్గా ఉంటారు. జోనల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్, సిబ్బంది మరో బృందంగా ఏర్పడి వార్డుల్లో పర్యటిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం జూన్ 23 నుంచి జూలై 23 వరకు నెలరోజుల పాటు జరుగుతుంది.
జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందే వినతుల పరిష్కారంలో క్వాలిటీ చాలా ముఖ్యం. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులంతా దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గతంలో పరిష్కారం కాని వినతులను కూడా సమర్థంగా, నాణ్యతతో పరిష్కరించాలి. సగటు మనిషి ముఖంలో చిరునవ్వులు చూడాలి. నిర్దేశించుకున్న సమయంలోగా నాణ్యతతో వినతులను పరిష్కరించడం ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతున్నాం..
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులు గడిచింది. ఇందుకోసం 1902 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం. 30 ప్రభుత్వ శాఖలు, 102 మంది హెచ్వోడీలతో పాటు రెండు లక్షల మందితో కూడిన ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు వినతుల పరిష్కారంపై దృష్టిపెట్టింది.
సీఎంవో, సచివాలయం, విభాగాధిపతులు దగ్గర నుంచి జిల్లాలు, మండల స్థాయిల్లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకూ 59,986 వినతులు అందగా నిర్దేశిత సమయంలోగా 39,585 విజ్ఞాపనలు పరిష్కరించాం. మరో 20,045 పరిష్కారం దిశగా పురోగతిలో ఉన్నాయి. 99.35 శాతం వినతులు పరిష్కారమయ్యాయి. వినతులు పరిష్కరించే తీరు బాగున్నా సంతృప్తి స్థాయి పెరగాల్సి ఉంది.
ఒకవేళ గ్రీవెన్స ను రిజెక్ట్ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి ఎందుకు తిరస్కరణకు గురైందో వారికి వివరించాలి. సచివాలయ సిబ్బంది, వలంటీర్ వెళ్లి సంబంధిత వ్యక్తికి వివరించాలి.
ఈమేరకు SOP లో మార్పులు తేవాలి. రిజెక్ట్ చేసిన గ్రీవెన్స్ను కలెక్టర్లు పరిశీలించాలి. ఇంకా పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే 24 గంటల్లోగా పరిష్కరించాలి. సంబంధిత విభాగానికి 24 గంటల్లోగా పంపాలి. ఈ మేరకు ప్రతి ఉద్యోగికి దీనికి సంబంధించి అవగాహన కల్పించాలి..
గడప గడపకూ మన ప్రభుత్వంలో ప్రాధాన్యతగా గుర్తించిన పనుల విషయంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి.
ఆయా గ్రామాల్లో ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం రూ.20 లక్షలు ప్రతి సచివాలయానికి ఇస్తున్నాం.
ఇది చాలా ప్రాధాన్యాంశం. గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గుర్తించిన పనులకు
ఈ డబ్బులు మంజూరు చేయాలి.
వెంటనే ఆ పనులు ప్రారంభమయ్యేలా చూడటం, నిధుల మంజూరు సక్రమంగా జరగాలి. నిధులకు ఎలాంటి కొరత లేదు. మంజూరు చేసిన పనులను వెంటనే మొదలు పెట్టేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకుని పనులను ముందుకు తీసుకెళ్లాలి.
జగనన్న సురక్ష ద్వారా వివిధ పథకాలకు అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన మంజూరు చేసి లబ్ధి చేకూరుస్తారు. అర్హత ఉన్నవారు ఎవరూ మిస్ కాకూడదన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశాల్లో ఒకటి. 26 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించిన అధికారులంతా ఆయా ప్రాంతాల్లో నెలకు రెండు దఫాలు పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
కలెక్టర్ల పర్యటన కూడా చాలా ముఖ్యమైన అంశం. ప్రతి జిల్లా కలెక్టర్ వారానికి రెండు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. నాలుగు సచివాలయాల్లో జాయింట్ కలెక్టర్ పర్యటించాలి. కార్యదర్శులు, హెచ్డీలు నెలకు కనీసం రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. ఐటీడీవో పీవో, సబ్ కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలి.