ఉపాధి కూలీల అకౌంట్లో పెండింగ్ MGNREGA డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం, స్టేటస్ ఇలా చూడండి

ఉపాధి కూలీల అకౌంట్లో పెండింగ్ MGNREGA డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం, స్టేటస్ ఇలా చూడండి

జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేసే కూలీలకు గత కొన్ని కొన్ని వారాలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2005 కోట్లకు పైగా కూలీలకు వేతనం చెల్లించాల్సి ఉండగా ఇందుకు సంబందించి కేంద్రం మరో 1726 కోట్లను విడుదల చేసింది.

ఉపాధి హామీ పెండింగ్ నిధులు విడుదల చేసిన కేంద్రం, త్వరలో అకౌంట్లోకి డబ్బులు

2023 24 ఆర్థిక సంవత్సరానికి MGNREGA లో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 15 కోట్ల పని దినాలను ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మూడు నెలల్లోని వినియోగించారు. కూలీలు చేసిన పనుల వివరాలను వారానికి ఒకసారి nrega వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన వారం తర్వాత చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఇంకా అమౌంట్ పడలేదు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 సంబంధించి ఉపాధి కూలీల వేతనాల చెల్లింపులకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మూడు విడతల్లో అమౌంట్ విడుదల చేసింది. ఇందులో మొదటి విడతగా రూ.1,046.40 కోట్లు, రెండో విడతగా రూ.1,019.91 కోట్లు, ఇప్పుడు తాజాగా మూడో విడతలో భాగంగా రూ.1,726.02 కోట్లు కలిపి మొత్తం రూ.3,792.33 కోట్లు ఇప్పటి వరకు మంజూరు చేసినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి తెలిపారు. ఇందులో జూన్ మూడో వారం వరకు కూలీలు చేసిన పనులకు సంబంధించి రూ.3,405.47 కోట్లు ఆయా కూలీల బ్యాంకు ఖాతాలకు జమ అయ్యాయని తెలిపారు. మిగిలిన పెండింగ్ అమౌంట్ ఏదైతే జూన్ నాలుగో వారం నుంచి ఉన్నాయో వాటిని కూడా ప్రస్తుతం మంజూరు చేసిన అమౌంట్ ద్వారా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

NREGA పేమెంట్ స్టేటస్ వివరాలను కింది లింక్ ద్వారా చెక్ చేయండి

కింది లింకులో పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలో ఇవ్వబడింది. మీ రాష్ట్రం, జిల్లా, మండలం, ఏరియా సెలెక్ట్ చేసుకుని ఉపాధి హామీ పేమెంట్ స్టేటస్ వివరాలు చెక్ చేయవచ్చు.

Click here to Share

7 responses to “ఉపాధి కూలీల అకౌంట్లో పెండింగ్ MGNREGA డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం, స్టేటస్ ఇలా చూడండి”

  1. Naresh Avatar
    Naresh

    NREGA Status Links

  2. Savara simhachalam Avatar
    Savara simhachalam

    Good

  3. Savara simhachalam Avatar
    Savara simhachalam

    Very very good

  4. సత్య Avatar
    సత్య

    May 27 నుండి ఇప్పటి వరకు ఉపాధి పని డబ్బులు ఒక్క రూపాయి కూడా పడలేదు

  5. aravavvenkata ramana Avatar
    aravavvenkata ramana

    Yes i was working mgnrega not credited to my account this year from 2024 may 27 is very sad sir

  6. Sairam Saidu Avatar
    Sairam Saidu

    Enkk money deposite
    avale

  7. Jarapalarambabunayak Avatar
    Jarapalarambabunayak

    Amount appudu paduthudi sri date Augastu nalalonaa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page