Nethanna Nestham : ప్రారంభమైన వైయస్సార్ నేతన్న నేస్తం ఇంటింటి వెరిఫికేషన్ మరియు థంబ్.. మూడు రోజులపాటు ప్రక్రియ

Nethanna Nestham : ప్రారంభమైన వైయస్సార్ నేతన్న నేస్తం ఇంటింటి వెరిఫికేషన్ మరియు థంబ్.. మూడు రోజులపాటు ప్రక్రియ

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం 24 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం కల్పించిన ప్రభుత్వం పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ కూడా ప్రారంభించింది.

ప్రారంభమైన నేతన్న నేస్తం వెరిఫికేషన్

కొత్తగా అర్హత ఉన్న లబ్ధిదారులకు జూన్ 20 వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు అవకాశం ఇచ్చారు. ఈ గడువు ముగియడంతో ఇక పాత లబ్ధిదారులను జల్లెడ పట్టే వెరిఫికేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.

పాత లబ్ధిదారులకు జూన్ 21 నుంచి 23 వరకు సచివాలయాల స్థాయిలో ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇంటింటి వెరిఫికేషన్ లో ఎవరైనా అనర్హులుగా తేలితే వారిని జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది.

వెరిఫికేషన్ కోసం సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ లో ఆప్షన్

లబ్ధిదారుల ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే ఆప్షన్ ని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి కల్పించడం జరిగింది. సచివాలయ సిబ్బంది కోసం నిర్దేశించబడిన బెనిఫిషరీ ఔట్రీచ్ అనే యాప్ ద్వారా లబ్ధిదారుల థంబ్ (వేలిముద్ర) మరియు వెరిఫికేషన్ నిర్వహించే ఆప్షన్ ని కల్పించారు.

Nethanna Nestham Ekyc option in BOP app

ఇందులో లబ్ధిదారులకు సంబంధించి మగ్గం పైన పనిచేస్తున్నారా, మగ్గం ఉందా, స్వతంత్రంగా మగ్గం ఉందా లేదా వేరే ఇతర దగ్గరైన పనిచేస్తున్నారా అనే అంశాలను సేకరిస్తారు. వాటికి సంబంధించిన బిల్ వంటివి కూడా అడుగుతున్నారు. ఇంకా మగ్గం వివరాలు కూడా ఇందులో పొందుపరుస్తున్నారు.

నేతన్న నేస్తం వెరిఫికేషన్ కి ఏ వివరాలు ఇవ్వాలి

వైయస్సార్ నేతన్న నేస్తం వెరిఫికేషన్ లో భాగంగా లబ్ధిదారుల నుంచి పైన పేర్కొన్న విధంగా మగ్గానికి సంబంధించిన వివరాలను సేకరించడం జరుగుతుంది. ఏ ఏ వివరాలు ఇందులో పందు పరుస్తారో ఇందుకు సంబంధించి కింద ఇవ్వబడిన డాక్యుమెంట్లో పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. చెక్ చేసి ఆ వివరాలను రెడీగా పెట్టుకోండి.

ఇక ఈ పథకానికి అర్హత సాధించిన అర్హుల తాత్కాలిక జాబితాను జూన్ 28 29 తేదీలలో సోషల్ ఆడిట్ కోసం సచివాలయాలలో ప్రదర్శించడం జరుగుతుంది, ఏమైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిశీలించి అందుకు అనుగుణంగా ఏవైనా సవరణలు ఉన్నచో తుది జాబితా ను జూలై 6,7 తేదీలలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

వైఎస్సార్ నేతన్న నేస్తం పూర్తి టైం లైన్స్ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అప్లికేషన్ లేదా పేమెంట్ స్టేటస్ ను కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేయవచ్చు

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page