BREAKING : ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్ అని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రకటన.. కొద్ది గంటల్లోనే దిగివచ్చిన ప్రభుత్వం

BREAKING : ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్ అని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రకటన.. కొద్ది గంటల్లోనే దిగివచ్చిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో మే 19 నుంచి ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ సేవలను బందు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.

ఈ మేరకు డాక్టర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కు అసోసియేషన్ లేఖ రాయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్ తో పోటీగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పై ఒక్కసారిగా ప్రభుత్వం కొద్ది గంటల్లోనే దిగి వచ్చింది.

ఒక రోజులోనే ₹368 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్ కి చెల్లించినట్లు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ హరింద్ర ప్రసాద్ ప్రకటించారు.

ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ నిర్ణయం తీసుకున్నాయి

రాష్ట్రవ్యాప్తంగా తమకు అందాల్సినటువంటి బకాయిలను సమయానికి ప్రభుత్వం అందించడం లేదని ప్రైవేట్ హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి అసోసియేషన్ ASHA ప్రకటించింది.

ప్రభుత్వం గత నెల విడుదల చేసినటువంటి బకాయిలు పరిశీలించినట్లయితే కనీసం 10% వైద్యానికి కూడా ఆ బకాయిలు సరిపోవట్లేదని లేఖలో అసోసియేషన్ వాపోయింది.

అదేవిధంగా ప్రభుత్వం కి ఎన్నిసార్లు విన్నవించిన సరైన రీతిలో తమకు సమాధానం రాలేదని అదేవిధంగా చర్చలకు కూడా తమను పిలవలేదని చెప్పి అసోసియేషన్ లేఖలో పేర్కొంది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ ఆరోగ్యశ్రీ సేవలను తప్పనిసరి పరిస్థితుల్లో నిలిపివేయవలసి వస్తుందని పేర్కొనడం జరిగింది.

కొన్ని గంటల వ్యవధిలో బకాయిల చెల్లింపు

ఏపీలో మే 19 నుంచి ఈ సేవలు ప్రైవేట్ హాస్పిటల్ లో నిలిపి వేస్తున్నట్లు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.

ఈ న్యూస్ వెలువడి నాకు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా మరియు న్యూస్ ఛానల్ లో భారీగా కవరేజ్ రావడంతో చాలామంది పేదవారు ఆందోళన గురవడం జరిగింది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే ఇందులో ఎటువంటి వాస్తవం లేదని, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ వారు లేఖ పంపించిన మాట వాస్తవమేనని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి బకాయిలను ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు జమ చేసినట్లు సీఈవో హరింద్ర ప్రసాద్ ప్రకటించారు.

హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖను మీరు కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు

You cannot copy content of this page