AP Cabinet has given key approvals for the various schemes and developmental projects in the state.
రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు మరియు పథకాలకు క్యాబినెట్ ఆమోదం. కాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కోసం అమలు చేస్తున్న ‘సున్నా వడ్డీ’ పథకం మూడో ఏడాది కూడా కొనసాగించేందుకు రూ.1,259 కోట్లు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం. ఏప్రిల్ 22 న సున్నా వడ్డీ పథకం అమౌంట్ జమ.
- ఏపి లో కొత్తగా పులివెందుల మరియు కొత్తపేట రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు
- జిల్లాల పునర్విభజనలో భాగంగా 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
- జిల్లా పరిషత్‌ల కాల పరిమితి, రిజర్వేషన్లు కొనసాగిస్తూ కేబినెట్ నిర్ణయం.
- చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో కొత్తగా 12 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం. ఇందులో 7 టీచింగ్ పోస్టులు, 5 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
- చిరు ధాన్యాల పంటలను ప్రోత్సహించేందుకు ఏపీ మిల్లెట్ మిషన్ పాలసీని 2022-23 నుంచి 2026-27 వరకు కేబినెట్ ఆమోదించింది.
- ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్‌ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ను, రెండు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఏపీ లో ఉన్నత విద్యాశాఖకోసం 253 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం. ఇందులో 23 ప్రిన్సిపల్, 31 టీచింగ్ పోస్టులు, 139 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
- రాష్ట్రంలో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల లో 82 ఎకరాలు, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు కోసం 84 ఎకరాల కేటాయింపు.
- ప్రభుత్వ వైద్యులు ఎవరూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 పోస్టుల భర్తీకి, ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
Leave a Reply