అన్ని సంక్షేమ పథకాల డబ్బులు పడాలంటే ప్రస్తుతం మీ బ్యాంక్ ఖాతా కి ఆధార్ సీడింగ్ ఉండాలి. ఆ విధంగా సీడింగ్ అయిన బ్యాంక్ ఖాతా ఎన్పీసీఏ కి కూడా మ్యాప్ అయి ఉండాలి. ఆ అకౌంట్ లో నే మీకు అమౌంట్ పడుతుంది.
NPCI mapping అంటే ఏమిటి?
మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నా లేదా ప్రస్తుతానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఏ ఉన్నా భవిష్యత్తు లో మరికొన్ని బ్యాంక్ ఖాతాలు తెరిచే అవకాశం కూడా ఉంటుంది.
బ్యాంక్ ఖాతాల కు ఆధార్ లింకింగ్ చేయడం తప్పనిసరి గా మారింది.
సంక్షేమ పథకాల నగదు ను ఇటీవల DBT అనగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్దతి లో నేరుగా లబ్దిదారుని ఖాతా కే పంపిస్తున్నారు. మరి ఏ ఖాతా లో ఈ అమౌంట్ జమ చేయాలి ?
ఉదాహరణ కు మీకు నాలుగు బ్యాంక్ ఖాతాలు ఉండవచ్చు, అదే విధంగా మీరు నాలుగు సంక్షేమ పథకాల కు సంబంధించి నగదు పొందుతూ ఉండవచ్చు.
అయితే , నాలుగు సంక్షేమ పథకాలకు మీరు నాలుగు అకౌంట్స్ ఇస్తాను అంటే కుదరదు. మీకు ఉన్న బ్యాంకులలో ఏదో ఒక బ్యాంక్ కు ఆధార్ సీడింగ్ చేసి, NPCI mapping రిక్వెస్ట్ పెడతారు. Npci mapping పూర్తి అయ్యాక, మీ అన్ని సంక్షేమ పథకాలకు మీరు ఇదే అకౌంట్ వాడాలి. ఒకవేళ వేరే అకౌంట్ వాడితే మీకు నగదు పడదు.
ఈ విధంగా ప్రభుత్వ పథకాల నిధులు ఫలానా అకౌంట్ కే జమ అవ్వాలని బ్యాంక్ కి మీ సమ్మతి తెలియజేసి DBT కోసం ఆ అకౌంట్ ను ఆధార్, NPCI కి లింక్ చేయడమే NPCI మ్యాపింగ్ అంటారు.
NPCI వద్ద అందరి ఆధార్ మరియు ఆధార్ సీడింగ్ అయిన బ్యాంక్ ఖాతాలు ఉంటాయి. అవి సరిగా మ్యాచ్ అయితేనే మీకు అమౌంట్ పడుతుంది. కాబట్టి ఇటీవల ఇది తప్పనిసరి గా మారింది.
మీ ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా కు సంబందించి NPCI mapping వివరాలు ఎలా చూడాలి ?
కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి మీరు మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయాలి
తరువాత captcha security code లో ఉన్న అంకెలు/లెటర్స్ యధావిధి గా ఎంటర్ చేసి send OTP పైన క్లిక్ చేయాలి
మీ మొబైల్ కి ఒక OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి మీ ఏ బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ జరిగి ఉందో NPCI mapping నుంచి మీకు డేటా చూపిస్తుంది.
NPCI mapping లో వేరే బ్యాంక్ ఉన్నా లేదా inactive ఉంటే ఏం చేయాలి?
వెంటనే ఏ బ్యాంక్ ఖాతా అయితే మీరు సంక్షేమ పథకాలకు ఇచ్చి ఉన్నారో ఆ బ్యాంక్ కు వెళ్లి NPCI లింక్ చేయమని మీ సమ్మతి ఇవ్వాలి.
ఇందుకోసం వారు ఒక ఫామ్ ఇస్తారు అందులో మీ ఖాతా, ఆధార్ వివరాలు నింపి, ఆధార్ Xerox కాపీ ని జత చేసి ఇస్తారు. వారం లోపు మీకు ఆధార్ సీడింగ్ అయిపోతుంది.
Leave a Reply