ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్ (member deletion in ration card andhra pradesh) వచ్చేసింది. రేషన్ కార్డులో అనర్హులుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల తొలగింపు సంబంధించి గ్రామం వార్డు సచివాలయంలో ఆప్షన్ కల్పించడం జరిగింది. ఈ ఆప్షన్ తో పాటు రేషన్ కార్డులో వివరాలు మార్చుకునే కొత్త ప్రాసెస్ ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది.
రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఎవరికి వర్తిస్తుంది?
గతంలో కేవలం చనిపోయిన వ్యక్తి పేరు తొలగింపు ఆప్షన్ మాత్రమే ఉండగా ప్రస్తుతం ఉద్యోగం, పెళ్లి, చదువు, ఇతరత్రా కారణాలతో వేరే రాష్ట్రానికి గాని వేరే దేశానికి గాని వలస పోయిన (migrate) సభ్యులను తొలగించేందుకు ప్రభుత్వం ఆప్షన్ కల్పించింది.
కుటుంబంలో ఎవరైనా పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన లేదా ఇతర దేశాలలో లేదా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినా, మిగిలిన కుటుంబ సభ్యులకు రేషన్ పొందడంలో ఎటువంటి సమస్య లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ ఆప్షన్ కల్పించడం జరిగింది.
రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు కు ఎవరిని సంప్రదించాలి
రేషన్ కార్డుల కుటుంబ సభ్యుల తొలగింపు కోసం సదరు రేషన్ కార్డు లబ్ధిదారుడు మీ గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయంలో ఉండే డిజిటల్ అసిస్టెంట్ ను సంప్రదించవచ్చు.
డిజిటల్ అసిస్టెంట్ సేవా పోర్టల్ ద్వారా మీ అభ్యర్థనను తీసుకొని వీఆర్వో లేదా డబ్ల్యు ఆర్వో రికమండేషన్ మేరకు వారి ఆమోదం లేకుండానే నేరుగా మీ అప్లికేషన్ను ఎమ్మార్వో ఆమోదానికి పంపించడం జరుగుతుంది. మీ వివరాలు మరియు వెరిఫికేషన్ పరిశీలించి సదరు కుటుంబ సభ్యులను రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ నుంచి తొలగించడం జరుగుతుంది.
ఇందుకు ఎంత ఫీజ్ చెల్లించాలి?
కేవలం నామమాత్రపు 24 రూపాయల ఫీజ్ తోటి ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది.
ఇంకా వేరే ఆప్షన్ ఏమి కల్పించారు?
రేషన్ కార్డులో మీ వివరాలను మార్చుకునే ఆప్షన్ను కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది. జెండర్, వయసు, రిలేషన్షిప్, అడ్రస్ వంటి వివరాలను మార్చుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం మీ సచివాలయంలో సంప్రదించండి.
రేషన్ కార్డు లేదా రైస్ కార్డులో కుటుంబ సభ్యుల తొలగింపు యూజర్ మాన్యువల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రేషన్ కార్డు లేదా రైస్ కార్డులో కుటుంబ సభ్యుల తొలగింపు అప్లికేషన్ ఫార్మ్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి
Download Rice Card Details Change application form
రేషన్ కార్డు లేదా రైస్ కార్డు లో వివరాలు మార్చుకునే ఆప్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
|Join us on WhatsApp for more updates.
Leave a Reply