Annadatha Sukhibhava Scheme: రైతు తనకు ఎన్ని నష్టాలు వచ్చినా.. వ్యవసాయం చేయడాన్ని మాత్రం మానడు. దేశానికి అన్నం పెట్టేందుకు తన చెమటను ధారపోస్తాడు. అలాంటి అన్నదాతలకు.. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారుతున్నాయి. అలాంటి రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘అన్నదాత సుఖీభవ’ (Annadata Sukhibhava Scheme). గత ప్రభుత్వ (వైఎస్సార్‌సీపీ) హయాంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 వారి ఖాతాల్లో జమ చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ+బీజేపీ+జనసేన కూటమి ఈ మెత్తాన్ని పెంచి రైతులకు ఏటా 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. అనంతరం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
Annadatha Sukhibhava Scheme 2025 Amount Release Date
జాన్ 12న అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు.
What is Annadatha Sukhibhava Scheme – అన్నదాత సుఖీభవ పథకం అంటే ఏమిటి?
అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM-KISAN పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.
Annadatha Sukhibhava Scheme Eligibilty – అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరు అర్హులు?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు.
- చిన్న, సన్నకారు రైతులు (5 ఎకరాల లోపు భూమి కలిగినవారు) మాత్రమే అర్హులు.
- వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- భూమికి సంబంధించి పక్కా పత్రాలు, పట్టా లేదా పాస్‌బుక్ తప్పనిసరిగా ఉండాలి.
- రైతు పేరు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి.
- రైతు పండించే పంటల వివరాలను నమోదు చేయాలి.
- భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు (Tenant Farmers) కూడా ఈ పథకానికి అర్హులు. అయితే, తప్పనిసరిగా కౌలు రైతు ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- సాధారణంగా పీఎం-కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ, అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారు.
Is Annadatha Sukhibhava Scheme కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తిస్తుందా?
సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న అన్నదాతలకు (కౌలు రైతులు) కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే, కౌలు రైతు ధ్రువీకరణ పత్రం (సీసీఆర్‌సీ కార్డు) కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
Who are not eligible for Annadatha Sukhibhava Schemeఅన్నదాత సుఖీభవ పథకం ఎవరికి వర్తించదు?
ఆదాయపన్ను (Income Tax) చెల్లించేవారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు.
ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు.
రూ. 10 వేలు, అంతకంటే ఎక్కువ పింఛను పొందేవారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు.
అన్నదాత సుఖీభవ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేయనున్నారు. అంటే, ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురి పేరిట భూమి ఉంటే వారిలో ఒక్కరికే లబ్ధి చేకూరుతుంది.
Annadatha Sukhibhava Scheme Required Documents – అన్నదాత సుఖీభవ పథకానికి ఏమేం పత్రాలు అవసరం?
✧ రైతు ఆధార్ కార్డ్
✧ భూమి పత్రాలు (పట్టా, పాస్‌బుక్, ఆర్.ఓ.ఆర్. (Record of Rights) లాంటివి)
✧ బ్యాంక్ పాస్‌బుక్
✧ మొబైల్ నంబర్
✧ భూమి వివరాలు (Survey Number)
✧ రైతు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
✧ ఆధార్ కార్డు నంబరును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకొని ఉండాలి.
How to apply Annadatha Sukhibhava Schemeఅన్నదాత సుఖీభవ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
★ అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాస్ బుక్, బ్యాంకు పాస్ బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రంలో అధికారులను సంప్రదించాలి. అక్కడి సిబ్బందికి వివరాలను అందించాలి.
★ అధికారులు రైతు సమర్పించిన పత్రాలను పరిశీలించి, వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు.
★ రైతుసేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్‌ల్యాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి, అర్హులైన వారిని అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు.
★ ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
Annadatha Sukhibhava Scheme Status Check -అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
అన్నదాత సుఖీభవ దరఖాస్తు స్టేటస్, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in ను ఓపెన్ చేయండి.
- హోంపేజీలోని ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, స్క్రీన్‌పై కనిపిస్తున్న క్యాప్చాను ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత Search ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, రైతు దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ (పెండింగ్, వెరిఫైడ్, రీజెక్ట్, పేమెంట్ జమ అయినది) చూపిస్తుంది.
Annadatha Sukhibhava Scheme Offline processఆఫ్‌లైన్‌లో (అధికారుల నుంచి) స్టేటస్ తెలుసుకోవడం ఎలా?
రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించినా, వారి లాగిన్ ద్వారా స్టేటస్ తనిఖీ చేస్తారు. అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు.
అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా ఎంపిక చేస్తారు?
అర్హులైన రైతులు తమ వివరాలను రైతుసేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు. రైతుసేవా కేంద్రాల వారీగా రికార్డయ్యే వెబ్‌ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో (Village Agricultural Assistants) పాటు మండల వ్యవసాయ అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా లాగిన్ ఆప్షన్ ఇచ్చారు. వెబ్‌ల్యాండ్‌లో సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఇతర వివరాలను పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయాధికారి ఆ వివరాలను ఫార్వార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలనకు వెళ్తాయి. వివరాలన్నీ సరిగా ఉంటే అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో ఆ రైతు పేరును చేరుస్తారు. వెబ్‌ల్యాండ్‌లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తారు.
అన్నదాత సుఖీభవ 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కోసం అర్హులైన రైతులు 2025 మే 20 లోపు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి, రైతులు తమ వివరాలను రిజిస్టర్ చేయించుకోవాలి.
అన్నదాత సుఖీభవ 2025 దరఖాస్తుకు చివరి తేదీ: మే 20
గమనిక:
ఈ పథకం ప్రభుత్వం నిర్దేశించే విధి విధానాలపై ఆధారపడి ఉంటుంది. కాలానుగుణంగా కొన్ని మార్పులు ఉండొచ్చు. ప్రభుత్వం తాజా ఆదేశాలు, లేటెస్ట్ నోటిఫికేషన్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడండి.
ఏపీ అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనాలు:
✦ రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం.
✦ అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20,000 పెట్టుబడి సహాయం.
✦ రైతులందరికీ విత్తనాలు, ఎరువులు మరియు విపత్తులకు సంబంధించిన బీమా కల్పించడం.
✦ రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహించడం.
✦ రైతుల సామాజిక స్థితి, జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం.
✦ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం.
అన్నదాత సుఖీభవ పథకం అనేది రైతులకు నేరుగా ఆర్థిక మద్దతు అందించడమే కాకుండా, వ్యవసాయంపై వారి నమ్మకాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు వ్యవసాయంలో మరింత ఉత్సాహంగా పాల్గొనేలా చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అన్నదాత పథకం గురించి తరచూ అడిగే ప్రశ్నలు (FAQs):
నాకు పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు జమ అవుతున్నాయి? అన్నదాత సుఖీభవ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా..?
పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి చేకూరుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నా నష్టంలేదు. అధికారులు డేటాను పరిశీలించి కొత్తగా అర్హులైన రైతులను జాబితాలో చేరుస్తారు.
కుటుంబంలో ఎంత మందికి అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు జమ చేస్తారు?
అన్నదాత సుఖీభవ పథకాన్ని ఒక కుటుంబం యూనిట్‌గా తీసుకొని అమలు చేస్తున్నారు. అంటే భార్య, భర్త, పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. కొత్తగా పెళ్లయిన పిల్లలను వేరే కుటుంబంగా పరిగణిస్తారు. అందువల్ల కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు వెంటనే తమ వివరాలను రైతు సేవా కేంద్రంలో రిజిస్టర్ చేయించుకోవాలి.
నాకు ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. అన్నదాత సుఖీభవ కింద ఇచ్చే నిధులు రావా?
పీఎం కిసాన్ కింద అందజేసే రూ.2000 లకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ఇచ్చే నిధులను కలిపి రైతు ఖాతాలో జమ చేస్తుంది. మూడు విడతల్లో కలిపి మొత్తం రూ.20 వేలు (పీఎం కిసాన్ 6000 + అన్నదాత సుఖీభవ 14,000) రైతు ఖాతాలో జమ చేస్తారు. అయితే, ఈ సీజన్‌కు సంబంధించి పీఎం కిసాన్ నిధులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. వారందరికీ పీఎం కిసాన్ నిధులు పోను, అన్నదాత సుఖీభవ కింద ఇచ్చే నిధులు జమ అవుతాయి.
ఏయే పంటలు పండించే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుంది?
వ్యవసాయంతో పాటు పండ్ల తోటలు, ఉద్యానవన తోటలు, పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసే రైతులు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు.
అన్నదాత సుఖీభవ పథకం ఎవరికి వర్తించదు?
ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుంది. ఆర్థికంగా బాగా ఉన్నవారికి, ఆదాయపు పన్ను చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు. మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్లు లాంటి వారికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించందు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారు అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులు. నెలకు రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు కూడా ఈ పథకానికి అనర్హులు. అయితే, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్-4, గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు ఉంది.
అన్నదాత సుఖీభవ పథకం కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అన్నదాత సుఖీభవ పథకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తు స్టేటస్‌ను మాత్రం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ (https://annadathasukhibhava.ap.gov.in ) లో లాగిన్ అయి, ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్ ఆధారంగా రైతులు తమ దరఖాస్తు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
Leave a Reply