Benefits of Sesame : ఎముకల పట్టుత్వానికి నువ్వులు దివ్య ఔషధం..అయితే ఎంత మోతాదులో తినాలో తెలుసా

నువ్వులు మనకు సాధారణంగా తెలుపు, నలుపు రంగుల్లో లభిస్తాయి. నువ్వులు తినడం వలన ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఎంత మోతాదు లో తీసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎముకల దృఢత్వానికి నువ్వులు ఎలా దోహద పడతాయి, ఎంత మోతాదు లో తీసుకుంటే మండించి వంటి Intersting facts మీకోసం.

ఎముకల పట్టుత్వానికి నువ్వులు

మన శరీరమంతా ఎముకల గూడు. ఎముక నిర్మాణానికి కావాల్సిన క్యాల్షియం నువ్వులో అధికంగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల నువ్వులలో సుమారు  975 mg క్యాల్షియం లభిస్తుంది. తృణధాన్యాల విషయంలో రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది, అయితే రాగుల్లో లభించే కాల్షియం కంటే కూడా సుమారు మూడింతలు మనకి నువ్వుల నుంచి లభిస్తుంది. నువ్వులలో కాల్షియంతో పాటు జింక్, మాంగనీస్ కూడా ఉంటుంది. ఈ రెండు ఎముకల దృఢత్వానికి ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి.

నువ్వులు ప్రతి రోజూ ఎంత మోతాదులో తీసుకోవాలి

అన్ని ఆహారాల్లోకెల్లా అత్యధికంగా కాల్షియం కలిగి ఉన్న ఈ నువ్వులు నానబెట్టినవి లేదా వేపుకున్నవి లేదా నువ్వుల ఉండ రూపం లో తీసుకుంటే చాలా మంచిది. రోజు ఒక టీ స్పూన్ లేదా ఒక నువ్వుల ఉండ తింటే చాలా వరకు క్యాల్షియం లోపాలను అరికట్టవచ్చు. మనకు కావలసిన క్యాల్షియం పెద్దలకు అయితే 450 మిల్లీ గ్రాములు, పిల్లలకు 600 మిల్లి గ్రాములు.. అంత ఎక్కువ కాల్షియం ఒక చిన్న నువ్వులు ఉండ తినడం వల్ల మనకు దొరుకుతుందనే సత్యం మనం గ్రహించాలి.అందుకే ప్రతి రోజూ మనం నువ్వులను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు కావలసిన క్యాల్షియం అందుతుంది. అయితే ఒక స్పూన్ కి మించి మీరు సేవించరాదు.

గమనిక: గర్భిణీ స్త్రీలు మొదటి ఆరు నెలలు నువ్వులు తినకూడదు.

నువ్వుల్లో ఇంకా ఏం పోషకాలు ఉంటాయి?

నువ్వుల్లో కాల్షియం జింక్ తో పాటు, మనకు కావాల్సిన ఫైబర్ కంటెంట్ లభిస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇక నువ్వుల్లో మెగ్నీషియం, ప్రోటీన్ వంటివి కూడా లభిస్థాయి. నువ్వుల్లో విటమిన్ B1,6, E కూడా మనకి లభిస్తుంది. నువ్వుల నూనె కొంతమేర చెడు కొలెస్ట్రాలను అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ ను అదుపులో ఉంచడానికి దోహదపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నల్ల నువ్వులు శ్వాస కోశ సంబదిత ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మంచిది.

నువ్వులు వేడి చేస్తాయని అంటారు నిజమేనా?

నువ్వులు వేడి చేస్తాయని చాలామంది నువ్వులు తినకూడదని అపోహలో ఉండి నువ్వులు మానేస్తున్నారు కానీ నువ్వులు వేడి చేస్తాయా అంటే వేడి అధికంగా తీసుకుంటేనే వేడి చేస్తాయి. పరిమితంగా నువ్వులను తీసుకొని సరిపడినంత నీళ్లు రోజువారి తాగితే నువ్వులు వేడి చేసే అవకాశం ఉండదు. మామూలుగా ఎవరైతే నీళ్లు తక్కువగా తీసుకుంటారో, సరిగా త్రాగరో వాళ్ల శరీరంలో నీరు చాలునందువల్ల కొన్ని లక్షణాలు వస్తాయి. ఆ వేడి చేసిన లక్షణాలు ఏమిటి అనగా మూత్రం లో మంట, కొంచెం ఇరిటేషన్ లాగా ఉండడం కానీ, తలనొప్పి, కళ్ళు మండినట్లు ఉండటం లాంటివి, మోషన్స్ లో బ్లడ్ పడిన లాంటివి లేదా శరీరము కొంత వెచ్చగా అనిపించినా ఇట్లాంటి లక్షణాలను వాడుక భాషలో పెద్ద వాళ్ళు వేడి చేసింది అని అంటారు. చాలా వరకు నీరు శాతము సరిగా లేక, ఇతర ఆహార కారణాల వలనో ఇటువంటి లక్షణాలు మీ శరీరంలో కనబడతాయి. ఈ లక్షణాలకు నువ్వులకు సంబంధం ఉండదు. అయితే నువ్వులను ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు దాని వలన నిజంగానే వేడి చేసే గుణం ఉంటుంది.

నువ్వులను ఏ విధంగా తీసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది

నువ్వుల ను వేపి పండు ఖర్జూరం తో తొక్కి ఉండ చేసుకొని తినడం, లేదా నువ్వులను వేపి పౌడర్ గా చేసి కూరలలో చల్లుకున్న మంచిది. ఈ విధంగా నువ్వులను ఈ రెండు రూపాలలో చక్కగా వాడుకోవచ్చు. నువ్వులను మీకు ఇంకోక పద్ధతిలో తింటే నువ్వుల లోని కాల్షియం మొత్తం బాగా వంటికి పడుతుంది అది ఎలాగా అంటే నువ్వులను ఏడు లేక ఎనిమిది గంటలు నానబెట్టి వాటిని విడిగా నమాలాలి. అలా అని మీరు రోజు ఉదయాన్నే తినే మొలకలు(sprouts) , బెల్లము పప్పులతో పాటు ఈ నానబెట్టిన నువ్వులను కలుపుకొని తినకూడదు. ఎందువలనంటే ఈ నువ్వులను మిగతా పప్పులతో కలిపి తినడం వల్ల నువ్వులు నమలబడవు అందువలన ఈ నువ్వులు మీ శరీరానికి పట్టవు. అందువలన మీరు నువ్వులను విడిగా బాగా నమిలి తింటే మంచిది. ఇలా నమిలి తినడం వలన ఆ నువ్వులలోని క్యాల్షియం మన శరీరానికి పడుతుంది.

నానబెట్టిన నువ్వులు ఎక్కువగా నమలలేని వారు ఆ నువ్వులను నానబెట్టి బాగా గ్రైండ్ చేసి వడగట్టిన నువ్వుల పాలను ఒక కప్పుతాగడం వలన కూడా మన శరీరానికి కావాల్సిన క్యాల్షియం ఇతర ఖనిజాలు దొరుకుతాయి. గమనిక: నువ్వులు ఒక స్పూన్ కి మించి రోజు తీసుకోకూడదు. నువ్వుల పాలు కూడా ఒక కప్పు పాల కన్నా ఎక్కువగా తాగకూడదు. “అతి సర్వత్ర వర్జయత్” అంటారు కదా కాబట్టి ఏదైనా మితంగా తింటే అమృతం అమితంగా తింటే విషం అనే సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి కావాల్సిన మోతాదులో తింటే ఆరోగ్యం పొందవచ్చు పొందవచ్చు.

నువ్వులు ఎవరు తినకూడదు?

గర్భిణీ స్త్రీలు మొదటి ఆరు నెలలు నువ్వులు తినకుండా ఉంటే మంచిదని experts తెలియజేస్తున్నారు.

అదేవిధంగా పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పచ్చి నువ్వుల కంటే వేపిన నువ్వులు లేదా ఏదైనా పదార్థాల్లో కలిపి తయారు చేసుకున్న పిండి వంటలు లేదా కూరల్లో తినడం మంచిది.


ముఖ్య గమనిక (Disclaimer): ఇందులో పేర్కొన్నబడిన అంశాలు అన్నీ కూడా వివిధ అధ్యయనాల ఆధారంగా మీకోసం ఇక్కడ వివరించడం జరిగింది. అయితే వివిధ వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను బట్టి కొన్ని పదార్థాలు వాడవచ్చు, వాడకూడదు. కాబట్టి అన్ని ఆరోగ్యల వారికి ఇది సరిపోకపోవచ్చు. కాబట్టి మీ వైద్యులను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోగలరు. వైద్య సలహాలకు నియమించిన ఈ సలహాలు ఏమాత్రం ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!