మనిషి జీవితంలో యవ్వనం అనేది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే దశ..వృద్ధాప్యాన్ని మనం ఎంత ఆపాలన్న ఆపలేము అయితే వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఎక్కువ కాలం యవ్వనంగా కనబడేలా ఉండేందుకు మాత్రం మనం ప్రయత్నించవచ్చు.
మనం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలన్నా లేదా మనలో త్వరగా వృద్దాప్య ఛాయలు కనపడకుండా ఉండాలన్నా మన ఆహారపు అలవాట్లు, మనం చేసే పని, వ్యాయామ అలవాట్లు అందుకు అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా పురుషులలో బయట పని చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి, సమయానికి తినక పోవడం, శరీరం పై దృష్టి పెట్టకపోవడం, కాలుష్యం వంటి వి వీరిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి.
పెరుగుతున్న వయస్సు మరియు సమయంతో, మన శరీరం క్షీణించడం ప్రారంభిస్తుంది. పురుషుల విషయంలో, 40 యేళ్లు దాటిన తర్వాత, జీవక్రియ రేటు తగ్గుతుంది. తద్వారా వివిధ వ్యాధులు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. నాలుగు పదులు దాటాక చర్మం పై ముడతలు, వృద్ధాప్యం యొక్క సంకేతాలు కనిపించడం తో పాటు, శరీరం కూడా బలహీన పడటం మొదలవుతుంది.
పైన చెప్పుకున్న విధంగా వృద్ధాప్య సంకేతాలను కొంతకాలం నిలువరించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
కింద ఇవ్వబడిన కొన్ని ఆహార పదార్థాలు ముఖ్యంగా పురుషులలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనపడకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి.. అవేంటో చూసేయండి
పురుషులను యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే
- టొమాటో [Tomatoes]
టమోటాలలో లైకోపీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే ఫైటోకెమికల్. చర్మం లో Collagen ను విచ్ఛిన్నం చేసేందుకు ఇది దోహద పడుతుంది. ఈ లైకోపీన్ మీ శరీరాన్ని హానికరమైన టాక్సిన్స్ ప్రభావాల నుండి కూడా రక్షిస్తుంది.
తద్వారా టమోటాలు మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడం లో దోహద పడతాయి. అంతేకాదు టమోటాలు గుండెకి కూడా చాలా మంచివి.
- చేపలు [Fish]
చేపలు లేదా చేపల నూనె లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అధిక చమురు ఉండే చాపలు శరీరానికి చాలా మంచిది.ఇవి శరీర కణాలను ఆరోగ్యకారంగా ఉంచి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. వీటిలో చక్కగా జీర్ణమయ్యే ప్రోటీన్ ఉంటుంది, ఇది మీ చర్మ ఆకృతిని మెరుగుపరిచి ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. అంతే కాదు చాపలు సేవించడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేపలను చేర్చడం వలన ఈ సత్ఫలితాలను పొందవచ్చు. చేపలు గుండెకు కూడా చాలా మేలు చేస్తాయి.
- నట్స్ [Nuts]
నట్స్ నిస్సందేహంగా ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతగానో దోహదపడతాయి. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలను పొందవచ్చు. శరీరం యవ్వనంగా ఉండటానికి అవసరమైన అన్ని విటమిన్లు మరియు పోషకాలను ఇవి అందిస్తాయి. ఒమేగా -3 అవసరాలను తీర్చడంలో మీకు సహాయపడే జీడిపప్పు, బాదం మరియు వాల్నట్ లను తప్పకుండా మీ ఫుడ్ మెనూలో చేర్చండి.
- బెర్రీలు [Berries]
స్ట్రాబెర్రీలు, బ్లాక్బెర్రీస్ మరియు బ్లూబెర్రీస్ (నేరేడు) వంటి బెర్రీ పండ్లు ఫ్లేవనాయిడ్లు మరియు ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ల ను కలిగి ఉంటాయి. ఈ ఫ్లేవనాయిడ్లు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొల్లాజెన్ ను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. తరచుగా బెర్రీస్ తినడం వలన ముడతలు మరియు చర్మ రంగు పాలిపోవడం వంటి సమస్యలను అధిగమించవచ్చు.
ఇతర పండ్లు చూసినట్లయితే దానిమ్మ విత్తనాలు, బొప్పాయి పండు వంటివి కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
- స్వీట్ పొటాటో [ చిలగడదుంపలు] [Sweet Potato]
స్వీట్ పొటాటో లేదా చిలగడదుంపలు లేదా గనసిగడ్డలు అని కూడా వీటిని పిలుస్తారు. వీటిలో బీటా క్యారటిన్ అనే ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి విటమిన్ ఏ గా మారి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటి వలన చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా తయారవుతుంది. చిలకడ దుంపల్లో విటమిన్ సి, ఈ కూడా పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలకుండా ఉండటానికి కూడా స్వీట్ పొటాటో లు దోహదపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
- గ్రీన్ టీ [Green Tea]
గ్రీన్ టీ ఇటీవల కాలంలో చాలా ప్రాముఖ్యత పొందినటువంటి ఈ పానీయం రెగ్యులర్గా తాగటం వలన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించి మీ మెటబాలిజం మెరుగు పడుతుంది. వీటిలో కాటెచిన్ పాలీఫెనాల్స్ అనేవి ఉంటాయి, ఇవి మీ శరీరాన్ని యవ్వనంగా ఉంచడంలో దోహదపడి మీరు వయసులో మిగిలిన వారి కంటే యంగ్ గా కనబడేలా చేస్తాయి.
Green Tea బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- పెరుగు లేదా యోగర్ట్ [Curd or Yogurt]
పెరుగు ప్రోటీన్లు సమృద్ధి గ లభిస్తాయి. పెరుగులో ఉండే మంచి బాక్టీరియం మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రిబోఫ్లావిన్, భాస్వరం, కాల్షియం వంటి ఖనిజాల తో పాటు విటమిన్ బి 12 కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. పెరుగు చర్మం మీద మచ్చలు మరియు ముడతలు తగ్గించడంలో దోహదపడుతుంది. మీ రోజువారీ ఆహారంలో ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో పెరుగును జోడించడం ఆరోగ్య పరంగా మంచి నిర్ణయం.
- అవోకాడో [Avocado]
అవోకాడో లో విటమిన్ బి మరియు ఇ పుష్కలంగా లభిస్థాయి. ఇవి చర్మానికి పూర్తి పోషణను అందిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడంలో విటమిన్ ఇ సహాయపడుతుంది. అవోకాడోలో ఉన్న గ్లూటాతియోన్ పురుషులలో వృద్ధాప్య ప్రక్రియను మందగించడానికి సహాయపడుతుంది.
ఈ అద్భుత ఆహారాలు మిమ్మల్ని యవ్వనంగా ఉండటానికి మరియు వృద్ధాప్య ప్రక్రియ ను తగ్గించడానికి ఖచ్చితంగా సహాయ పడతాయి. కాబట్టి వీటిని మీ ఆహారంలో చేర్చి యవ్వనంగా ఆరోగ్యంగా ఉండండి.
Disclaimer: ఇందులో పేర్కొనబడిన ఆహారాలు కేవలం మీకు సలహా కోసం మాత్రమే. వేరువేరు అధ్యయనాలు మరియు నిపుణుల సూచనల మేరకు వీటిని సలహా కోసం మీకు అందించడం జరిగింది. అయితే కొంతమంది శరీర పరిస్థితుల కనుగుణంగా ఈ డైట్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సలహా ను మీ డాక్టర్ లేదా మీ న్యూట్రిషనిస్ట్ సలహాల కు ఏమాత్రం ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు.
One thought on “Anti Aging Foods: పురుషులు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే ఏం తినాలి? ఒకసారి మెనూ చూడండి”