వేసవికాలంలో శరీరంలో వేడినీ తగ్గించే పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుతుంది.
మరి శరీరం వేడిని తగ్గించే పదార్థాలు చూస్తే, వీటిలో మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, కీర దోసకాయ వంటి వాటితో పాటు రాగిజావ ముందు వరుసలో ఉంటుంది.
రాగిజావను వేసవిలోనే కాదు అన్ని కాలాల్లో కూడా సేవించవచ్చు. ఈ రాగి జావలో ఉండే ప్రత్యేకతలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.
రాగి జావ లో ఉండే పోషక పదార్థాలు
రాగుల్లో క్యాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. అన్ని తృణ ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో ఎక్కువగా క్యాల్షియం లభిస్తుంది. పొటాషియం , ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి.
ప్రతీ 100 గ్రాముల రాగుల్లో ఉండే పోషక పదార్థాలు ఇవే
- Energy 328 Kcal
- Protein 7.30 gm
- Carbohydrates 72 gm
- Fat 1.30 gm
- Dietary fiber 11.50 gm
- Iron 3.9 mg
- Sodium 11 mg
- Calcium 344 mg
- Potassium 408 mg
- Carotene 42 μg
రాగి జావ వలన ఉపయోగాలు
రాగి జావ వలన శరీరానికి తగిన మోతాదు లో క్యాల్షియం లభించి ఎముకలు దృఢంగా ఉంటాయి.
రక్తంలో షుగర్ అనగా చక్కర స్థాయిలను నియంత్రణ లో ఉంచడానికి రాగి జావ దోహద పడుతుంది.
రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించేందుకు కూడా రాగి జావ సహాయపడుతుంది.
రాగుల్లో లభించే ఫైబర్ , metabolism ను పెంచి జీర్ణ వ్యవస్థ ను మెరుగుపరుస్తుంది.
వేసవి కాలంలో రాగి జావ తాగడం వలన పోషకాలతో పాటు డీహైడ్రేషన్ అనగా ఒంటిలో నీరు శాతం తగ్గకుండా ఉంటుంది.
బెల్లం తో తయారు చేసుకునే రాగి జావ వేసవి లో ఇంకా ప్రయోజన కరం. దీని వలన dehydration చాలా వరకు తగ్గుతుంది.
రాగులతో చాలా రకాల ఆహార పదార్థాలను తాయారు చేస్తారు. రాగి ముద్ద, ఇడ్లీ, దోశ లో కూడా వాడుతారు. అయితే వేసవి లో ద్రవ రూపంలో ఉండే రాగి జావ సేవించడం అన్నిటికంటే ఉత్తమం.
రాగి జావ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం
రాగి జావ లేదా రాగి మాల్ట్ తయారు చేసే విధానాన్ని చూద్దాం
కావలసిన పదార్థాలు (ఇద్దరికీ):
రాగి పిండి – 20 గ్రాములు
బెల్లం – 20 గ్రాములు
ఉప్పు – తగినంత
నీరు – 300 మి.లీ [పెద్ద గ్లాస్]
తయారీ విధానం:
ఒక గిన్నెలో 20 గ్రాముల రాగి పిండిని 40 మిల్లీ లీటర్ల చల్లని నీటిలో(రెండింతల నీరు పోసి) ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ముందుగా నీటిని కాచుకోవాలి.
నీరు మరిగే సమయంలో నీటిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి.
మరిగే నీటిలో ముందుగా తయారు చేసిన రాగి పిండిని వేసి ఉండలు రాకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి.
దీనికి బెల్లం వేసి, బెల్లం అంతా కరిగిపోయేలా కలుపుతూ ఉండాలి.
అంతే వేడి వేడి రాగి జావ రెడీ. దించుకొని కొంచెం వేడిగా తాగితే మంచిది.
ఇది చదవండి : పురుషులు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే ఏం తినాలి
If you like this article leave your feedback as comments below
2 thoughts on “Ragi Millet: రాగి జావ లో ఉండే పోషక గుణాలు తెలుసా? ఇది ఎలా తయారు చేస్తారో చెక్ చేయండి”