ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలందరికీ జీరో ఫేర్ టికెట్ (zero fare ticket) ఇవ్వాలని ఆయన అధికారులకు తెలిపారు.
మహిళలందరికీ జీరో ఫేర్ టికెట్
ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరియు ట్రాన్స్జెండర్ల కు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో మహిళలకు జారీ చేయాల్సిన టికెట్ కి సంబంధించి ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ప్రభుత్వం వంద శాతం రాయితీ తోటి జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో మహిళలకు ఎంత లబ్ధి చేకూరింది. 100% రాయితీ అందించాము అనే విషయాలను అందులో పొందుపరచాలని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ పథకం అమలు చేయడం వల్ల ఆర్టీసీకి నష్టం రాకుండా ఉండేలా ఇతర మార్గాలు అన్వేషించాలని ఆయన అధికారులను కోరారు. నిర్వహణ వ్యయం తగ్గించుకుంటే సంస్థను లాభాల బాటలో నడిపించవచ్చని ఆయన తెలిపారు. ఇక పైన కొనుగోలు చేసే అన్ని బస్సులు ఏసి ఎలక్ట్రిక్ బస్సులు ఉండాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులు గా మార్చేలా ప్రణాళిక చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పరిధిలో ఉచిత బస్సు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.
|ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. క్లిక్ చేయండి
Leave a Reply