రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు కీలక అప్డేట్ ని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వైయస్సార్ సున్నా వడ్డీ పథకం నాలుగో విడత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 11న విడుదల చేయనుంది.
కోనసీమ జిల్లా నుంచి అమౌంట్ విడుదల చేయనున్న సీఎం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి ముఖ్యమంత్రి వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్ సున్నా వడ్డీ నిధులను మహిళల ఖాతాలో జమ చేయనున్నారు.
మొత్తం 9.48 లక్షల డ్వాక్రా గ్రూపులలోని మహిళలకు 1358.78 కోట్లను మహిళల ఖాతాలో విడుదల చేయనున్నారు.
వైయస్సార్ సున్నా వడ్డీ పథకం గురించి షార్ట్ గా మీకోసం
స్వయం సహాయక సంఘాలు లేదా DWCRA సంఘాలను
బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
ప్రారంభించిన పథకం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం.
వైఎస్ఆర్ హయాంలో పావలా వడ్డీ రుణాలతో ప్రారంభించ బడిన ఈ పథకం తరువాత సున్నా వడ్డీ పథకం గా అమలు అవుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు తీసుకున్నటువంటి రుణాలకు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఒక ఏడాదిలో సకాలంలో చెల్లించిన రుణాలకు వడ్డీ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం ఖాతాలో జమ చేస్తుంది.
గమనించగలరు : 5 లక్షల లోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న అమౌంట్ కు మాత్రమే ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుంది.
వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం కింది లింక్ ని ఫాలో అవ్వండి
Leave a Reply