YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 వాయిదా

కాపు వర్గానికి చెందిన పేద ప్రజలకు ఆర్థిక సహాయం కోసం మరియు స్వయం ఉపాధి కల్పించడం కోసం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది. 2023 వ సంవత్సరానికి గాను కాపు నేస్తందరఖాస్తు ప్రక్రియ మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయింది. అయితే ఆగస్టు 30 న విడుదల కావాల్సి ఉన్న కాపు నేస్తం 2023 అమౌంట్ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడింది.

వర్షాల నేపథ్యంలో వాయిదా

కాపు నేస్తం సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయిన నేపథ్యంలో తొలుత ఆగస్టు 22న నిడదవోలు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అమౌంట్ విడుదల చేయాల్సి ఉండగా ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు ఆ జిల్లా కలెక్టర్ మాధవిలత ప్రకటించారు. వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 30 కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అయితే 30 న జరగాల్సిన కార్యక్రమం కూడా వాయిదా పడింది.

కాపు నేస్తం 2023 అమౌంట్ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా.

Kapu Nestham 2023 Release Date: September 2023

Last Date for EKYC : August 29 2023 [Already completed]

ప్రారంభమైన లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ [Kapu Nestham EKYC 2023-24 ]

సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ నమోదు చేస్తున్నారు. లబ్ధిదారులు అందరూ తప్పనిసరిగా మీ సచివాలయంలో కానీ లేదా మీ వాలంటీర్ ను సంప్రదించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

బెనిఫిషియరీ ఔట్రీచ్ యాప్ మరియు ఈ కేవైసీ చేయు పూర్తి విధానం కింది లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి.

Download Beneficiary Outreach app for EKYC

కాపు నేస్తం జాబితా NBM పోర్టల్ లో విడుదల [ Kapu Nestham 2023-24 Final Eligible List ]

మరోవైపు సచివాలయం ఎన్.బి.ఎం అనే పోర్టల్ ద్వారా లబ్ధిదారుల తుది జాబితాను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా లబ్ధిదారులు NBM పబ్లిక్ పోర్టల్ ద్వారా నేరుగా తమ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.

ఎవరికైతే తుది జాబితాలో పేరు ఉంటుందో వారు తప్పనిసరిగా థంబ్ వేసి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ వివరాలను కింది లింక్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది. అది ఎంటర్ చేయగానే మీకు మీ వివరాలు కనిపిస్తాయి.

Kapu Nestham 2023-24 Eligibility List

Kapu Nestham 2023-24 Release Date

ఈ నెల 22న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పర్యటనలో భాగంగా కాపు నేస్తం పథకం అమౌంట్ ను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన లబ్ధిదారులు వెంటనే eKYC పూర్తి చెయ్యండి. eKYC పూర్తి చేసిన వారికి మాత్రమే అమౌంట్ జమ అవుతుంది అని ప్రకటించింది.

Click here to Share

2 responses to “YSR Kapu Nestham 2023 Release Date – వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 వాయిదా”

  1. Bodapudi kavitha Avatar
    Bodapudi kavitha

    Kappu nastham

  2. Bodapudi kavitha Avatar
    Bodapudi kavitha

    Ekyc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page