వైయస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫా పథకాలకు సంబంధించి కీలక అప్డేట్..
ఈ రెండు పథకాల ద్వారా పెళ్లి చేసుకునే SC/ST/BC/మైనారిటీ మరియు భావన నిర్మాణ కార్మికుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించి ఇటీవల దరఖాస్తు గడువును 60 నుంచి 30 రోజులకు ప్రభుత్వం తగ్గించడం జరిగింది. ఈ కొత్త గడువు 06.03.2023 నుంచి అమలు కానుంది.
ఇటీవల పెళ్ళైన వారికి కీలక అప్డేట్
అయితే ఈ నిర్ణయం రాష్ట్రంలో చాలా మందికి తెలియదు. దీంతో 60 రోజుల గడువు ఉందని భావించి కొంతమంది ఈ బెనిఫిట్స్ కి దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అటువంటి వారికోసం ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎవరైనా పెళ్ళై 30 రోజులు దాటి 60 రోజుల్లోపు ఉంటే, అటువంటి వారు మరో ఐదు రోజుల్లో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అనగా ఏప్రిల్ 4 వరకు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ మేరకు లబ్ధిదారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా గ్రామ వార్డు సచివాలయం శాఖ అధికారులను కూడా ప్రభుత్వం ఆదేశించింది.
వైఎస్సార్ కల్యాణమస్తు, షాది తొఫా పథకాలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, పూర్తి అర్హతల కోసం కింది లింక్ చెక్ చేయండి
Leave a Reply