Big Update: వైయస్సార్ చేయూత అమౌంట్ 4 నెలలు వాయిదా

Big Update: వైయస్సార్ చేయూత అమౌంట్ 4 నెలలు వాయిదా

ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది. వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది అమౌంటును సెప్టెంబర్ 2023లో విడుదల చేయాల్సి ఉండగా ఈ కార్యక్రమం 2024 జనవరి కి వాయిదా పడింది.

2024 లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరియు ఫిబ్రవరి నెలలో అధికార పార్టీ తమ మేనిఫెస్టోని ప్రకటించనున్న నేపథ్యంలో వైయస్సార్ చేయూత అమౌంట్ ను జనవరిలో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.

జనవరి 10 నుంచి 20 వరకు వైయస్సార్ చేయూత చేయూత

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ప్రతి ఏటా 18750 అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నాలుగో ఏడాది అమౌంట్ను జనవరి 10 నుంచి 20 వరకు పది రోజులపాటు అందించనున్నట్లు ప్రకటించింది.

పది రోజులపాటు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జనవరిలో ఈ ప్రభుత్వం అందచేసిన అమౌంట్ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు తెలియజేసే విధంగా పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇప్పటికే వైయస్సార్ చేయూత అప్లికేషన్స్ మరియు వెరిఫికేషన్ దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో అమౌంట్ పడుతుందని అందరు భావించినప్పటికీ ఒక్కసారిగా నాలుగు నెలలు వాయిదా పడటం గమనార్హం.

వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ కోసం కింది లింక్ చెక్ చేయండి

YSR Cheyutha Release Date : 10 to 20th January 2024

జనవరి 20 నుంచి 30 వరకు వైయస్సార్ ఆసరా

జనవరిలోనే మహిళలకి మరో ముఖ్యమైన పథకమైనటువంటి వైయస్సార్ ఆసరా అమౌంట్ ను కూడా విడుదల చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.

జనవరి 20 నుంచి 30 తేదీ వరకు వైయస్సార్ ఆసరా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైయస్సార్ ఆసరా చివరి విడుదల మరో 6500 కోట్లను మహిళల ఖాతాలో జనవరి 20 నుంచి 30 తేదీలోపు చెల్లింపులు చేస్తామని సీఎం అన్నారు.

Click here to Share

You cannot copy content of this page