Volunteer Awards Postponed: వాలంటీర్ సేవా అవార్డుల కార్యక్రమం వాయిదా.. తిరిగి ఎప్పుడంటే

Volunteer Awards Postponed: వాలంటీర్ సేవా అవార్డుల కార్యక్రమం వాయిదా.. తిరిగి ఎప్పుడంటే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా గ్రామ వార్డు వాలంటీర్లకు అందిస్తున్నటువంటి సేవా అవార్డులకు సంబంధించి కీలక అప్డేట్. 2023 సంవత్సరానికి సంబంధించి ఈ సేవ అవార్డులను ఏప్రిల్ 14న ప్రారంభిస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఈ కార్యక్రమం వాయిదా పడింది.

ఏప్రిల్ 14వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో భాగంగా వాలంటీర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమాన్ని వచ్చేనెల మే నెలకు వాయిదా వేయడం జరిగింది. మే మొదటి వారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

అయితే కరెక్ట్ తేదీని ఇంకా ప్రకటించలేదు మే మొదటి వారంలో ఈ కార్యక్రమం ఉండనున్నట్లు మాత్రమే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Volunteer seva Awards ceremony postponed to new date : May 2023

ఏప్రిల్ 14వ తేదీన ఎంతో ఆర్భాటంగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే కొవ్వూరు డివిజన్ కు సంబంధించి సేవా అవార్డులకు ఎంపికైనటువంటి వాలంటీర్ల జాబితా కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది.

వచ్చేనెల మొదటి వారంలో కూడా కొవ్వూరు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.

ఇక ఇప్పటివరకు విడుదలైనటువంటి అన్ని సేవా అవార్డుల లిస్ట్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది లింక్ ను వీక్షించండి

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page