జగనన్న విద్యా దీవెన పథకం కి సంబంధించి ఈ ఏడాది మూడో విడత అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జనవరి – మార్చ్ నాల్గొవ త్రైమాసికానికి సంబందించిన అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం నేడు జమ చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పర్యటన లో భాగంగా 9.95 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 703 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ సీఎం అమౌంట్ ను జమ చేశారు.
రాష్ట్రంలో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఎంబిబిఎస్, ఇంజనీరింగ్ తదితర కోర్సులలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో ప్రతి ఏడాది ఫీజు అమౌంట్ ను ఈ పథకం ద్వారా చెల్లిస్తున్న విషయం తెలిసిందే.
ఏప్రిల్ 26 న ప్రబుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే చాలా మంది విద్యార్థులకు ఈ అమౌంట్ మే నెలలోనే జమ అయింది. ఇక ప్రస్తుతం విడుదల చేసినటువంటి విద్యా దీవెన అమౌంట్ ఎప్పటిలోపు ఖాతాలో జమ అవుతుందో వేచి చూడాలి.
విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెక్ చేయు పూర్తి విధానం [Vidya Deevena Payment Status]
జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలు కింది లింకు ద్వారా చెక్ చేయండి.
ఇది చదవండి: విద్యా దీవెన SC విద్యార్థులకు కీలక అప్డేట్..ఇలా చేస్తేనే మిగిలిన 60% అమౌంట్ జమ
Leave a Reply