ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి విడతలో పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు..
తొలి విడత లో వివిధ కారణాలతో అమౌంట్ పడని వారికి Grievance raise చెయ్యడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే… అయితే ఇప్పుడు అర్జీ పెట్టుకొని అర్హత పొందిన వారికి ప్రభుత్వం అమౌంట్ విడుదల చేసింది ani అధికారులు తెలిపారు.
అలాగే బ్యాంకు ఖాతాతో NPCI యాక్టివ్ లేని కారణంగా అమౌంట్ పడని వారికి కూడా అమౌంట్ విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. తల్లికి వందనం పథకం అమౌంట్ పడిందో లేదో కింది లింక్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోండి.
తల్లికి వందనం స్టేటస్ తెలుసుకోండి
సొంతంగా తల్లికి వందనం పేమెంట్ స్టేటుస్ చెక్ చేసుకునే ప్రాసెస్ 👇🏼[Thalliki Vandanam Payment Status 2025]
తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ & పేమెంట్ స్టేటస్ ను సొంతంగా తెలుసుకునేందుకు నేరుగా కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి
Scheme : Thalliki Vandanam
Year : 2025-2026
UID : తల్లి / తండ్రి / సంరక్షకుల lఆధార్
ఎంటర్ చేసి చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేసి ఆధార్ కు లింక్ ఉన్న మొబైల్ కు వచ్చే OTP నమోదు చేస్తే స్టేటస్ తెలుస్తుంది.
సచివాలయం లో తెలుసుకునే విధానం
తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ను తెలుసుకునేందుకు జాబితా మొత్తం చదివే పని లేకుండా నేరుగా సచివాలయ ఉద్యోగులైన WEA/DA/WWDS/WEDPS వారి BENEFICIARY MANAGEMENT వెబ్ సైట్ లాగిన్ నందు నేరుగా చెక్ చేసుకునే “Track Application Status” ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దేనికి కేవలం తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుంది వారు అర్హుల అనర్హుల అనే విషయం తెలుస్తుంది.

Leave a Reply