➤ Talliki Vandanam Scheme 2024 Guidelines Released : తల్లికి వందనం అర్హతలు, మార్గదర్శకాలు 2024 జారీ
Talliki Vandanam Scheme 2024: ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రస్తుతం తల్లికి వందనంగా సవరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జీవో ను విడుదల చేసింది. గత ప్రభుత్వం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే 15000 చెల్లిస్తుండగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి 15000 చెల్లించడం జరుగుతుంది.ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం "తల్లికి వందనం" పథకం పేరిట దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న క్లాసులు I నుండి XII వరకు చదివే విద్యార్థులను పాఠశాలలు/కళాశాలలకు పంపడానికి తల్లి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి సంవత్సరానికి రూ.15,000/- ఆర్థిక సహాయం అందిస్తుంది.
➤ గ్రామీణ ప్రాంతాలు నెలకు రూ. 10000/- లోపు పట్టణ ప్రాంతాలు నెలకు రూ. 12000/-ల లోపు ఉండాలి.
➤ 3 ఏకరాలు కంటే తక్కువ మాగాణి లేదా 10 ఏకరాలు కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్ఠంగా 10 ఏకరాలు లోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులు
➤ తల్లి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
➤ కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయింపు ఉంటుంది.
➤ లబ్దిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (ట్రాక్టర్, టాక్సీ, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).
➤ గడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు పదాసరి 300 యూనిట్లు మించరాదు.
➤ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు.
➤ మున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అ ల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులు. (పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది).
➤ వయస్సు & లింగం షరతు వర్తించదు.
➤ పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు / సమీకృత ధృవీకరణ పత్రం ఉండాలి
➤ తల్లి/ లబ్దిదారు యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా, ఆధార్ తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండి ఉండాలి.
➤ విద్యార్థులు 75% హాజరు ఉండేలా చూసుకోవాలి.
Note : అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత అర్హత ప్రమాణాలు మారే అవకాశం ఉంటుంది.
ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు తల్లికి వందనం కింద అమౌంట్ పొందాలంటే తప్పనిసరిగా వారికి ఆధార్ ఉండాలి.
ఆధార్ కార్డ్ ఒకవేళ విద్యార్థి పేరుతో లేకపోతే వెంటనే దరఖాస్తు చేసి దరఖాస్తు చేసినటువంటి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ తో పాటు కింద ఇవ్వబడిన ఏదో ఒక ప్రూఫ్ ని జత చేయాల్సి ఉంటుంది.
బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, మేజర్ అయితే ఓటర్ కార్డ్, nrega కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా వ్యక్తిని గుర్తిస్తూ ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ లేదా తాహసిల్దార్ జారీ చేసిన దృవ పత్రం అయినా ఉండాలి.
ప్రస్తుతం ఆధార్ కార్డు ఎన్రోల్ చేస్తుంటే నెలలోపే వస్తుంది కాబట్టి ఇప్పటినుంచే లబ్ధిదారులు ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఎక్కువ శాతం మంది మైనర్ పిల్లలే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ పిల్లలకు ఆధార్ కార్డుకి అప్లై చేయాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వం మాదిరి గానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒకటి నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ పథకం కింద నగదు పొందాలంటే తప్పనిసరిగా 75% హాజరు ఉండాలని నిబంధన ను కొనసాగించడం జరిగింది.
పైన పేర్కొన్నటువంటి అర్హతలను తల్లికి వందనం పథకం తో పాటు విద్యా కానుక స్టూడెంట్ కిట్స్ పథకానికి కూడా అమలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.