Thalliki Vandanam Amount Released తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయ్

Thalliki Vandanam Amount Released తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయ్

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) నిధులు విద్యార్థుల తల్లులు, సంరక్షకుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ మేరకు సోషల్‌ మీడియాలో తెదేపా (TDP) పోస్ట్‌ చేసింది. ‘‘చెప్పిన విధంగా.. ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు పడుతున్నాయి’’ అని ఆ పార్టీ పేర్కొంది. ఇద్దరు పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారు ఖాతాలో రూ.26 వేలు పడ్డాయని పేర్కొంటూ బ్యాంకు నుంచి మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను తెదేపా పోస్ట్‌ చేసింది. మరో రూ.4 వేలు స్కూల్‌ ఖాతాలో పడ్డాయని తెలిపింది.

‘తల్లికి వందనం’ పథకాన్ని గురువారం నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 35,44,459 మంది ఖాతాల్లో నిధులు జమచేస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున విడుదల చేసింది. ఇందులో రూ.13వేలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు, మిగతా రూ.2వేలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమచేస్తున్నారు.

ముఖ్య గమనిక: అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతి కి వెళ్ళే పిల్లలు, మరియు 10 వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్ లో చేరే పిల్లలు పేర్లు,ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26తారీకు వరక వీరి నమోదు ప్రక్రియ జరిగి, 30 వ తేదీన వెలువడే తుది జాబితాలో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్ళకి July 5 తర్వాత అమౌంట్ జమ అవుతాయి. ఈ సంవత్సరం ఇంటర్ 2nd year పూర్తి అయిన విద్యార్థులకు మాత్రం తల్లికి వందనం పథకం వర్తించదు. ఎందుకంటే వాళ్లు విద్య దీవేన పథకం కిందకి వస్తారు.

తల్లికి వందనం స్టేటస్ తెలుసుకోండి

సొంతంగా తల్లికి వందనం పేమెంట్ స్టేటుస్ చెక్ చేసుకునే ప్రాసెస్ 👇🏼

తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ & పేమెంట్ స్టేటస్ ను సొంతంగా తెలుసుకునేందుకు నేరుగా కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి

Scheme : Thalliki Vandanam
Year : 2025-2026
UID : తల్లి / తండ్రి / సంరక్షకుల lఆధార్

ఎంటర్ చేసి చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేసి ఆధార్ కు లింక్ ఉన్న మొబైల్ కు వచ్చే OTP నమోదు చేస్తే స్టేటస్ తెలుస్తుంది.

సచివాలయం లో తెలుసుకునే విధానం

తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ను తెలుసుకునేందుకు జాబితా మొత్తం చదివే పని లేకుండా నేరుగా సచివాలయ ఉద్యోగులైన WEA/DA/WWDS/WEDPS వారి BENEFICIARY MANAGEMENT వెబ్ సైట్ లాగిన్ నందు నేరుగా చెక్ చేసుకునే “Track Application Status” ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దేనికి కేవలం తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుంది వారు అర్హుల అనర్హుల అనే విషయం తెలుస్తుంది.

తల్లికి వందనం ఇంటర్మీడియట్ SC విద్యార్థులు

▪️తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంటర్మీడియట్ SC విద్యార్థులకు వారి తల్లి అకౌంట్ కు బదులుగా,విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ కి జమ అవుతుంది.

▪️కావున 2024-25 లో ఇంటర్ చదివిన SC విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి వారికి NPCI లింక్ చేయించవలెను.

▪️ఒకవేళ విద్యార్థికి ఇది వరకే బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ కు NPCI లింక్ చేయించవలెను.

▪️తల్లికి వందనం పథకానికి సంబంధించి NPCI లింక్ లేని ఇంటర్ SC విద్యార్థుల వివరాలు మీకు ఇది వరకే షేర్ చేయడం జరిగినది.

తల్లికి వందనం జీ ఓ. 26 హైలైట్స్

☛ ఈ జూన్ 12 లాంచింగ్

☛ July 5 చెల్లింపు

☛ G.O.26 & 27 ప్రకారము ఈ రోజు రు.15000/- ఆర్థిక సహాయమును 1 నుండి 12 వరకు గుర్తింపు పొందిన Govt/Pvt Aided/Pvt Unaided లలలో చదువుచున్న పిల్లలు గల BPL Family లోని తల్లుల ఖాతాలలోకి విద్యార్ధికి రు.13000/- చొప్పున నికర జమ చేయబడును.

☛ విద్యార్థి ఒకరికి ఇచ్చే రు.15000/- లలో రు.2000/-లను పాఠశాల మెయిన్టెనెన్స్ కు మినహాయించి రు.13000/- తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

అమలు కు సంబంధించిన సమాచారం

☛ 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి తల్లికి వందనం ఇవ్వరు. 2025-26 విద్యా సంవత్సరము నుంచి ఆరంభం 2025-26 విద్యాసంవత్సరము లో హాజరు శాతంతో నిమిత్తము లేకుండా చెల్లించ బడును.

ఈ పథకం పొందాలంటే అర్హతలు

☛ 2024-25 లో 75% హాజరు ఉన్న వారికే 2025-26 ‘తల్లికి వందనo’ కి అర్హులు.

☛ కుటుంబంలో ఒకరికైనా White Ration Card ఉండాలి

☛ U Dise లో Data ను Head of the Institution వారు కరక్ట్ అని Ensure చేయాలి.

☛ పిల్లల, తల్లి, తండ్రి లేక సంరక్షకుల ఆధార్ నెంబర్లు చెల్లుబడి అయి ఉండాలి

☛ Total House hold Monthly Income గ్రామాలలో రు.10000/-, పట్టణాలలో రు.12000/- మించ రాదు.

☛ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించ రాదు.

☛ పట్టణాలలలో అయితే 1000 చ.అ పైబడి స్ధలము ఉండరాదు.

☛ House Hold Members లో ఏ ఒక్కరరికి 4 Wheeler ఉండ రాదు.

☛ సరాసరి నెలకు 300 యూనిట్లకు మించి కరెంటు వినియోగం ఉండరాదు

☛ House Hold Member ఆదాయపు పన్ను చెల్లించే వారు తల్లికి వందన లబ్దికి అనర్హులు.

☛ ఫీజు రీ ఇంబర్స్ మెంట్ సదుపాయము ఉన్న IIIIT, Poly Technical లో చదివే పిల్లల తల్లులు అనర్హులు

☛ 2025-26 విద్యా సంవత్సరమునకు 1నుండి 12 తరగతులలో ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఈ ఆర్ధిక సహాయం పరిశీలించ బడును.

☛ విద్యాహక్కు చట్టం 2009 ఫీజు లు 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి యాజమాన్యాలకు ప్రభుత్వం బకాయిల చెల్లింపులు చేయాలి.. అది ప్రభుత్వం మధ్య యాజమాన్యాలకు సంబంధించిన వ్యవహారం తల్లిదండ్రులు గమనించగలరు. తల్లిదండ్రులకు సంబంధం లేదు.

☛ 2025-26 సంవత్సరంకు సంబంధించి RTE Act 12(1)(c) క్రింద Private Schools లో చేరిన వారికి ఆ యా పాఠశాలల యాజమాన్యాలకు SPD ద్వారా ఫీజు క్రింద TV చెల్లించ బడును. మిగిలిన ఫీజు RTE Act ప్రకారము చెల్లింపు జరుగును.

☛ తల్లి లేకపోతేనే తండ్రికి, ఇద్దరూ లేక పోతే ఆధార్ Guardian కు చెల్లించ బడును. అనాధ పిల్లలకు జిల్లా కలెక్టరు ద్వారా చెల్లించబడును

షెడ్యూల్

☛ G.O.27 లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారము June 12 నుండి 28 వరకు అర్హులైన తల్లులు/ తండ్రులతో విద్యార్థుల జాబితా తయారు చేసి 1 నుండి ఇంటర్ వరకు చదువు చున్న అర్హులైన విద్యార్థుల తుది జాబితాను June 30 న గ్రామ/ వార్డు సచివాలయాలలో (Publish) ప్రదర్శిస్తారు.

☛ July 5 న తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది.

భూమి సమస్య – తల్లికి వందనం :

భూమి లేకున్నా ఉన్నట్టు చూపించిన, అర్హతలోపు ఉండి ఎక్కువ భూమి చూపించిన, ఉన్న భూమి అమ్మేసినా ఇంకా అనర్హులుగా చూపిస్తే ఎం చేయాలో చూడండి.

తల్లికి వందనం పథకము అర్హతలు

తల్లికి వందనం పథకము అర్హతలు చక్కగా వివరించటం జరిగింది.

4 చక్రాలా వాహన సమస్య – తల్లికి వందనం :

నాలుగు చక్రాల వాహనం అమ్మేసిన, నాలుగు చక్రాల వాహనాన్ని టాక్సీగా మార్చిన ఇంకా అనర్హులుగా చూపిస్తే ఎం చేయాలో చూడండి.

Click here to Share

5 responses to “Thalliki Vandanam Amount Released తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయ్”

  1. Meka lakshmi Praveena Avatar
    Meka lakshmi Praveena

    We didn’t get ammaki vandanam

  2. Karlakunta chenchaiah Avatar
    Karlakunta chenchaiah

    No

  3. కొల్లం సుజాత Avatar
    కొల్లం సుజాత

    మాకు తల్లికి వందనం రాలేదు సార్

  4. T karuna Avatar
    T karuna

    Sir talliki vandhanam padaledhu

  5. Natta Sunitha Avatar
    Natta Sunitha

    మా బాబు కి కూడా తల్లికి వందనం డబ్బులు పడలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page