వైయస్సార్ రైతు భరోసా మరియు PM కిసాన్ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి.
వైయస్సార్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ నిధులను ఫిబ్రవరి 28 సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయడం జరిగింది.
ఈసారి అమౌంట్ ఎంత జమ అయిందంటే?
ప్రతి ఏటా మూడు విడతల్లో వైయస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
తొలి విడతలో భాగంగా మే లేదా జూన్ నెలలో 7500, అక్టోబర్ లేదా నవంబర్ నెలలో 4000 ఇక ప్రస్తుతం విడుదల చేస్తున్నటువంటి మూడో విడత కింద ₹2000 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తాయి.
ముఖ్య గమనిక: అయితే ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో జమ చేసిన అమౌంట్ కేవలం పిఎం కిసాన్ అమౌంట్ 2000 రూపాయలు మాత్రమే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కి సంబంధించిన రైతు భరోసా వాటా ఏమీ ఉండదు. అయినప్పటికీ ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి మూడో విడత కూడా బటన్ నొక్కడం జరుగుతుంది. అయితే పీఎం కిసాన్ నిధులను ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా విడుదల చేసిన తర్వాతనే రైతుల ఖాతాలో ఈ అమౌంట్ జమ అవుతుంది.
మహారాష్ట్ర నుంచి PM కిసాన్ 16వ ఇన్స్టాల్మెంట్
మహారాష్ట్ర, యవత్మాల్ జిల్లా పర్యటనలో ఫిబ్రవరి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ 16వ విడత నిధులను దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు.
ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ ఈ అమౌంట్ జమ కానుంది. సుమారు 20 వేల కోట్ల పైగా నిధులను రైతుల ఖాతాలో బటన్ నొక్కి ప్రధానమంత్రి రేపు విడుదల చేయనున్నారు.
రైతు భరోసా PM కిసాన్ స్టేటస్ [YSR Rythu Bharosa 2024]
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ కి మీరు అర్హులా కాదా, జాబితాలో మీ పేరు వివరాలు మరియు మీ పేమెంట్ స్టేటస్ వివరాలు అన్నీ కూడా కింది పేజీలో ఇవ్వబడిన ప్రాసెస్ ని అనుసరించి మీరు చెక్ చేయవచ్చు.
మీ జాబితాలో పేరు మరియు స్టేటస్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి