YSR Cheyutha : ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్..ఆరోజు నుంచి ఖాతాల్లోకి చేయూత డబ్బులు

YSR Cheyutha : ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్..ఆరోజు నుంచి ఖాతాల్లోకి చేయూత డబ్బులు

వైయస్సార్ చేయూత లబ్ధిదారులకు గుడ్ న్యూస్, వైయస్సార్ చేయూత నాలుగో విడత అమౌంట్ సంబంధించి ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది.

ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు చేయూత అమౌంట్

రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ , బీసీ మైనారిటీ మహిళలకు ప్రతి ఏటా 18,750 లను రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ చేయూత పేరిట వారి ఖాతాలో జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్సార్ చేయూత నాలుగో ఏడాది అమౌంటును ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈసారి ఈ కార్యక్రమాన్ని మొత్తం 10 రోజులపాటు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

గతంలో ఈ కార్యక్రమాన్ని జనవరి 10 నుంచి 20 మధ్యలో నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల దీనిని ఫిబ్రవరి నెలకు వాయిదా వేయడం జరిగింది. ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఈ పథకాన్ని వరుసగా నాలుగు ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే నాలుగో విడత అమౌంట్ కి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో ఫీల్డ్ లెవల్ వెరిఫికేషన్ పూర్తయింది. 2023 లోనే అమౌంట్ పడాల్సి ఉండగా ఈ కార్యక్రమం ఫిబ్రవరి 2024 వాయిదా పడటం జరిగింది.

వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించినటువంటి మరింత సమాచారం కోసం కింది లింక్ ని ఫాలో అవ్వండి.

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాల అప్డేట్స్ కోసం టెలిగ్రాం లో జాయిన్ అవ్వండి.

You cannot copy content of this page