Cheyutha Update: వైయస్సార్ చేయూత మరోసారి వాయిదా, అమౌంట్ ఎప్పుడంటే

Cheyutha Update: వైయస్సార్ చేయూత మరోసారి వాయిదా, అమౌంట్ ఎప్పుడంటే

ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనార్టీ మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది. ఈ పథకాన్ని ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వాయిదా వేయడం జరిగింది. వాస్తవానికి ఈ పథకాన్ని గత ఏడాదే విడుదల చేయాల్సి ఉండగా , ఈ చివరి విడత అమౌంట్ ను 2024 ఫిబ్రవరి రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Update: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన వైఎస్ఆర్ చేయూత, మరోసారి వాయిదా. ఫిబ్రవరి 26న విడుదల కావాల్సి ఉన్నప్పటికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. కొత్త డేట్ త్వరలో అప్డేట్ చేయబడుతుంది.

వైయస్సార్ చేయూత ఫిబ్రవరి 26 కి వాయిదా

2024 లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరియు ఫిబ్రవరి నెలలో అధికార పార్టీ తమ మేనిఫెస్టో ని ప్రకటించనున్న నేపథ్యంలో వైయస్సార్ చేయూత అమౌంట్ ను ఫిబ్రవరి లో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే ఫిబ్రవరి 16 నుంచి 21కి వాయిదా వేసిన ప్రభుత్వం మరోసారి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈనెల అనగా ఫిబ్రవరి 26న ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ప్రతి ఏటా 18750 అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నాలుగో ఏడాది అమౌంట్ ను ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 6  వరకు పది రోజులపాటు అందించనున్నట్లు ప్రకటించింది.

గమనిక: ఫిబ్రవరి 26న విడుదల కావాల్సి ఉన్న వైఎస్సార్ చేయూత మరోసారి వాయిదా పడింది. కొత్త తేదీ మరోసారి అప్డేట్ చేయనున్న ప్రభుత్వం.

పది రోజులపాటు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఈ ప్రభుత్వం అందచేసిన అమౌంట్ ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు తెలియజేసే విధంగా పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

వైయస్సార్ చేయూత అప్లికేషన్స్ మరియు వెరిఫికేషన్ గత ఏడాదే పూర్తి అయిన నేపథ్యంలో గత ఏడాది షెడ్యూల్ ప్రకారం అమౌంట్ పడుతుందని తొలుత అందరు భావించినప్పటికీ ఒక్కసారిగా నాలుగు నెలలు వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత మరో నెల రోజులు జాప్యంతో ప్రస్తుతం ఫిబ్రవరి 26 న ముహూర్తం ఖరారు అయింది.

వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్, స్టేటస్  కోసం కింది లింక్ చెక్ చేయండి

YSR Cheyutha Release Date : 26th February till 06th March 2024 – Postponed [ఈనెల 26న విడుదల కావాల్సి ఉన్న వైఎస్సార్ చేయూత వాయిదా పడింది]

వైయస్ఆర్ చేయూతతో పాటు మరో ముఖ్యమైన పథకమైనటువంటి ఈ బీసీ నేస్తం పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఈ పథకాన్ని కూడా మార్చి మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

You cannot copy content of this page