రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో సేవలు అందించే 255464 మంది గ్రామ వార్డు వాలంటీర్లకు ఈ నెల 15 న రాష్ట్ర ప్రభుత్వం సేవ పురస్కారాలను అందించనుంది. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరుసగా నాలుగో ఏడాది కూడా గ్రామ వార్డు వాలంటీర్ల కు సేవా అవార్డులను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15 2024 న గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుంచి ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు.
ఇప్పటికే జిల్లాల వారీగా అర్హులైన వాలంటీర్ల జాబితా సిద్ధమయ్యాయి. అన్నీ జిల్లాల సేవా మిత్రా సేవా రత్న సేవా వజ్ర లిస్టు లు ఒక్కొకటిగా విడుదల అవుతున్నాయి.
ఇప్పటి వరకు విడుదల అయిన జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్ అన్ని studybizz కి చెందిన కింది లింక్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు వరకు విడుదలైనటువంటి గ్రామ వార్డ్ వాలంటీర్ సేవా అవార్డుల లిస్ట్ కింది లింక్ లో చెక్ చేయండి
2024 వాలంటీర్ సేవ పురస్కారాలకు సంబంధించి మొత్తం 255464 మందిని ఈ పురస్కారాలను ఎంపిక చేయగా, ఇందులో 875 మందికి సేవా వజ్ర ఇస్తారు. నియోజకవర్గానికి ఐదుగురు చప్పున వీరిని ఎంపిక చేస్తారు. ఇక రెండో అత్యుత్తమ పురస్కారమైనటువంటి సేవా రత్న పురస్కారానికి సంబంధించి 4150 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మండలంలో లేదా మున్సిపాలిటీలో ఐదుగురు చొప్పున లేదా నగరపాలిక సంస్థలో 10 మంది చొప్పున వీరిని ఎంపిక చేస్తారు.
ఇక మిగిలిన వారందరికీ సేవ మిత్ర పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా సంవత్సరం కాలం వాలంటీర్లు అందించిన వారు దీనికి అర్హులు. సేవా మిత్ర క్రింద రాష్ట్ర ప్రభుత్వం 250439 మంది వాలంటీర్లను ఎంపిక చేసింది.
రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం జిల్లాల వారిగా ఎవరైతే ఫైనల్ జాబితాలో చోటు సంపాదించుకుంటారో వారికి నియోజకవర్గస్థాయిలో వారం రోజులపాటు ఈ పురస్కారాలను అందించడం జరుగుతుంది.